BigTV English

Kavitha: బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపే కుట్ర.. అవసరమైతే జైలుకెళ్తా.. కవిత కామెంట్స్

Kavitha: బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపే కుట్ర.. అవసరమైతే జైలుకెళ్తా.. కవిత కామెంట్స్

Kavitha: బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.  కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా కవిత టార్గెట్ చేసి మాట్లాడినట్టు స్పష్టంగా తెలుస్తోంది.


‘నాది బీఆర్ఎస్ పార్టీ. నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది. కాంగ్రెస్ మునిగిపోయే నావ. ఆ పార్టీతో రాయబారాలు నాకెందుకు?. బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు. ఇంకెవరి నాయకత్వం నేను అంగీకరించను. 101 శాతం బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది. నేను జైలులో ఉన్నప్పుడు ఇదే జరిగింది’ అని కవిత వ్యాఖ్యానించారు.

‘పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారు. నా లీఖ లీక్ చేసిందెవరో చెప్పాలి. కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలిపలేదు. ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారు. నేను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను. హుందాగా ఉంటాను. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరఫును నేను చేస్తున్నా. కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదు’ అని కవిత నిలదీశారు.


‘నా డిమాండ్ ఒక్కటే.. నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలి. లీకు వీరులను పట్టుకోమంటే.. గ్రీకు వీరులు నాపై దండెత్తారు. దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభం..? ఆడబిడ్డ మీద పడి ఏడిస్తే ఏం వస్తుంది? నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు. నన్ను కేసీఆర్ కు దూరం చేసే కుట్ర చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో కావాలనే ఓడించారు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు. ముందు ఒకటి వెనుక ఒకటి మాట్లాడను. నేను కేసీఆర్ లాగా చాలా తిక్కదాన్ని. ఎవరికీ భయపడను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగట్లేదు. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు. నాకు నీతులు చెబుతున్నారా? పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా? వరంగల్ మీటింగ్ సక్సెస్ అయితే మా వల్లనే అంటే జనాలు నవ్వుకుంటున్నారు’ అని కవిత వ్యాఖ్యానించారు.

ALSO READ: MLC Kavitha : కవితకు షోకాజ్ నోటీసులు? ఖేల్ ఖతం!

‘ఏమైనా ఉంటే పార్టీ ఫోరమ్ లోపల మాట్లాడాలి అన్నారు. అసలు ఫోరమ్ లోపల ఏముంది. అందుకే బయట మాట్లాడుతున్నాను. లేఖ ఎందుకు రాశావని అంటున్నారు. ఒక్కటి కాదు వంద లేఖలు రాశాను. నాపై ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పా. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయవద్దని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే.. ట్విట్టర్ లో పోస్టులు పెట్టి ఊరుకుంటే సరిపోతుందా? బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయొద్దని చెప్పాను. కొంతమంది బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపాలని చూస్తున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related News

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Big Stories

×