SSMB29 : టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, దర్శకుడు వీరుడు రాజమౌళి కాంబినేషన్లో మహేష్ బాబు 29వ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో బిజీగా ఉంది. త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రాజమౌళి క్రేజ్ హాలీవుడ్ వరకు వెళ్ళింది. దాంతో ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ మూవీకి ఆస్కార్ రావడంతో భారతీయ చిత్ర దర్శకులలో నెంబర్ వన్ స్థానంలోకి రాజమౌళి చేరాడు. ఈయనతో సినిమా చేయాలని సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు.. రాజమౌళితో సినిమాలు చేయడానికి నిర్మాతలు కోట్లు కుమ్మరించడానికి రెడీగా ఉన్నారు. ఆయన సినిమాల్లో నటించాలని పెద్ద స్టార్స్ కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ఓ బాలీవుడ్ హీరో మాత్రం రాజమౌళి ఆఫర్ ని రిజెక్ట్ చేశారన్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేశారో ఒకసారి తెలుసుకుందాము..
రాజమౌళి ఆఫర్ కోసం బాలీవుడ్ వెయిటింగ్..
రాజమౌళి చేస్తున్న సినిమాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను దక్కించుకుంటున్నాయి. అయితే ఆయన సినిమాలో చిన్న పాత్రలో రెండు మూడు నిమిషాలు కనిపించిన చాలని చాలామంది స్టార్స్ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బాలీవుడ్ బిగ్‌స్టార్స్ మొత్తం జక్కన్న గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఓ నటుడు మాత్రం స్వయంగా రాజమౌళి ఆఫర్ ఇస్తే తిరస్కరించాడట. భారీ రెమ్యునరేషన్, మంచి క్యారెక్టర్ ఇస్తామన్నా ఆ నటుడు నో చెప్పాడని మీడియాలో వార్తలు కథలుగా చెప్తున్నారు. అయితే ఎందుకు ఆయన రిజెక్ట్ చేశారు అన్న విషయం తెలియలేదు కానీ… ఈ వార్త మాత్రం అటు బాలీవుడ్ లోనూ.. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది..
జక్కన్న ఆఫర్ రిజెక్ట్ చేసిన నానాపటేకర్?
బాలీవుడ్ ఇండస్ట్రీలో నానాపటేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. SSMB29 లో ఓ ముఖ్య పాత్ర కోసం రాజమౌళి ఓ బాలీవుడ్ నటుడిని సంప్రదించదంతో పాటు 20 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట. అయినప్పటికీ ఆ నటుడు జక్కన్నకి నో చెప్పారట. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియాతో తెగ ప్రచారం చేస్తోంది.. రాజమౌళి స్వయంగా పూణే వెళ్లి నానా పటేకర్‌ను కలిశారట. పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం వివరించారట.. అయితే కేవలం 15 రోజులు డేట్స్ ఇస్తే చాలని ఇందుకోసం రూ.20 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట జక్కన్న.. కానీ ఆయనకు ఉన్న కమిట్ మెంట్స్ వల్ల ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. దీనిపై రాజమౌళి క్లారిటీ ఇస్తారేమో చూడాలి..
Also Read :పెళ్లైన తర్వాత ఫస్ట్ టైం భార్య విషయాలు షేర్ చేసుకున్న బిగ్ బాస్ మానస్… కోపం ఎక్కువే అంటూ…
SSMB29 షూటింగ్ అప్డేట్..
మహేష్ బాబు నుంచి రానున్న తొలిప్రేన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.. ఇక టాలీవుడ్ నుంచి తొలి పాన్ వరల్డ్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఒడిషాలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఈ చిత్ర యూనిట్ అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించింది.. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాని ఎంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది మార్చిలోకల్లా సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది..