MLC Kavitha : కవిత తీరుపై BRS అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఆమెకు BRS షోకాజ్ నోటీసులు ఇవ్వబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. KTR టార్గెట్‌గా ఇప్పటికే పార్టీపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఆమెకు BRS షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ ఒక్కడే నాయకుడు..
కవిత తేల్చేసింది. తన గొడవ ఎవరితో చెప్పకనే చెప్పేసింది. నా పార్టీ BRS. బీఆర్ఎస్‌కు కేసీఆర్ ఒక్కడే నాయకుడు. నేను ఇంకెవరి కిందా పనిచేయను. నా జోలికొస్తే బాగుండదు.. ఇలా సూటిగా సుత్తి లేకుండా చెప్పేసింది కవిత. ఆమె టార్గెట్ కేటీఆరే అనేది క్లియర్ కట్‌గా తెలిసిపోతోంది. ఎక్కడా కేటీఆర్ పేరు వాడకుండా.. ఆమె చేసిన కామెంట్స్ అన్నీ ఆయన్నే వేలెత్తి చూపిస్తున్నాయని అంటున్నారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం..
బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు.. ఇది 101 శాతం నిజం.. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రపోజల్ తీసుకొచ్చారంటూ బాంబు పేల్చారు కవిత. తాను ఎంతకాలమైనా జైల్లో ఉంటాను కానీ, బీజేపీలో పార్టీని కలిపేయడానికి అస్సలు అంగీకరించనంటూ గట్టిగా చెప్పారట. తనను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికీ లేదంటూ రెబల్ వాయిస్ వినిపించారు కవిత.
మీకేంటి నొప్పి?
నా నాన్నకి నేను లేఖ రాస్తే మీకు ఏంటి నొప్పి? కవిత డైరెక్ట్ క్వశ్చన్. అది కేటీఆర్‌నే అనేది ఓపెన్ సీక్రెట్. పార్టీలో లీక్ వీరులను బయటపెట్టమంటే.. గ్రీకు వీరులలాగా ఫోజులు కొడుతున్నారంటూ మరింత మసాలా కూడా యాడ్ చేశారు. పెయిడ్ చానెళ్లతో ఇంటి ఆడపడుచుపై కుట్రలు చేశారు.. తన మీద పడి ఏడిస్తే ఏం ఉపయోగం అంటూ మండిపడ్డారు. ఇంటి ఆడపడుచు అని కవిత అన్నారంటే.. ఆ మాటలు కేటీఆర్‌ను కాకుండా ఇంకెవరిని అన్నట్టు? ఇంతకంటే క్లియర్‌గా ఇంకేం చెబుతారు.
నోటీసులు ఇస్తే..
కేసీఆర్‌కు నోటీసులు వస్తే పార్టీ నేతలు స్పందించలేదు.. కానీ వేరే నాయకుడికి వస్తే ఎమ్మెల్యేలంతా వెళ్లారని కవిత తన అక్కస్సు వెళ్లగక్కారు. అంటే, ఆ డైలాగ్ కేటీఆరే గురించే అంటున్నారు. ఫార్ములా ఇ కార్ రేసు కేసులో ఆయనకు ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్‌ను ఇంటికెళ్లి మరీ కలిసి సంఘీభావం తెలిపారు. ఆదే విషయం ఇప్పుడు గుర్తు చేస్తున్నారు కవిత. కేసీఆర్‌కు కాళేశ్వరం స్కాంలో నోటీసులు వచ్చినప్పుడు రాని ఆ ఎమ్మెల్యేలంతా.. కేటీఆర్ కోసం మాత్రం పరుగులు పెట్టారనేది ఆమె ఆగ్రహం. మరి, కేసీఆర్ ఫాంహౌజ్‌కు నో ఎంట్రీ బోర్డు ఉంటుంది కదా కవితక్క? అంటున్నారు.
అధిష్టానం సీరియస్
చాలానే కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆమె మాటలు పార్టీకి తీవ్ర డ్యామేజ్ చేస్తున్నాయి. ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీదే ఇన్ని ఆరోపణలు చేయడంతో గులాబీ కేడర్ కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్.. కూతురుపై సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఏదైనా ఉంటే ఫాంహౌజ్‌కు వచ్చి మాట్లాడాలి.. ఇలా పబ్లిక్‌గా కామెంట్స్ చేయడం ఏంటని గుస్సా అవుతున్నారట. అందుకే, ముందుగా కవితకు షోకాజ్ నోటీసులు రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఆమె వివరణ తీసుకున్నాక.. వేటు వేసే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.