Rajesh Death:ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.. ఈరోజు ఉదయమే ఒక డైరెక్టర్ మరణించగా.. ఇప్పుడు మరో హీరో తుది శ్వాస విడిచి, అభిమానులను ఆందోళనలకు గురి చేస్తున్నారు. దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించి, హీరోగా కెరియర్ మొదలుపెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరించిన ఆయన నేడు మన మధ్య లేరని తెలిసి, అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేష్ (Rajesh). తమిళనాడు మన్నార్ గుడి లో జన్మించిన రాజేష్ తొలుత సీరియల్స్ ద్వారానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 50 ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి దాదాపు 150 సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈరోజు కాసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. అటు అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.పలువురు రాజేష్ మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.
రాజేష్ నటించిన తెలుగు చిత్రాలు..
రాజేష్ తమిళ నటుడే అయినప్పటికీ తెలుగులో కూడా పలు చిత్రాలు చేసి ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు వంటి చిత్రాలలో నటించి తెలుగు ఆడియన్స్ ను మెప్పించారు. ఇకపోతే ఎక్కువగా తమిళ్, మలయాళం సినిమాలలో నటించిన ఈయన ఇప్పుడు 75 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు.
రాజేష్ వ్యక్తిగత జీవితం..
1983లో ప్రముఖ సామాజిక సంస్కరణ వాది, ద్రవిడ నాయకుడు పట్టుకోట్టై డేవిస్ వానతిరాయర్ మనవరాలైన జోన్ సిల్వియాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె దివ్య ,కుమారుడు దీపక్ ఉన్నారు. 2004లో నటన రంగ ప్రవేశం చేసిన రాజేష్ భార్య జోన్ సిల్వియా 2012 ఆగస్టు 6న మరణించారు.
ఇకపోతే 1985లో చెన్నైలోని కేకే నగర్ సమీపంలో సినిమా షూటింగ్ కోసం బంగ్లా నిర్మించిన తొలి తమిళ నటుడు కూడా ఈయనే. అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ సహాయం తో దీనిని నిర్మించడం జరిగింది. ఇక ఆ ఇంట్లో అనేక తమిళ్, మలయాళం, హిందీ సినిమా షూటింగ్లు జరిగేవి. తర్వాత 1993లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ఆ ఇంటిని అమ్మేశారు. ఇక తన స్నేహితుడు జెప్పియార్ సలహా మేరకు హోటల్, నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈయన సినిమా జీవిత విషయానికొస్తే.. 1974లో అవల్ ఒరు తోడర్ కథై అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ రంగప్రవేశం చేసిన ఈయన, దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించారు. 2024 లో వచ్చిన క్రిస్మస్ శుభాకాంక్షలు అనే సినిమాలో చివరిగా నటించారు. అటు సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో కూడా నటించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు.
ALSO READ:Gaddar Awards : గద్దర్ అవార్డ్స్ అనౌన్స్… బెస్ట్ మూవీ దేనికంటే..?