E-Paper
Advertisement

అమెరికా గడ్డపై వేప పుల్లకు యమా క్రేజ్.. ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

అమెరికా గడ్డపై వేప పుల్లకు యమా క్రేజ్.. ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Neem Benefits: స్వేచ్ఛ బ్యూరో: మన దగ్గర లభించే అమూల్యమైన వృక్ష సంపదను మనం గుర్తించడం లేదు. విదేశీయులు వేప వైపు మొగ్గు చూపడానికి దాని వెనుక ఉన్న శాస్త్రీయ కోణం, అద్భుత మైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కేవలం ట్రెండ్ మాత్రమే కారణం కాదని తెలుసు కోవాలి.

ఎంతో ప్రయోజనకర మైన వృక్షం వేప చెట్టు

మనం ఆధునికత పేరుతో ప్లాస్టిక్ బ్రష్‌లు, కెమికల్ పేస్టుల వెంట పడుతుంటే.. ప్రపంచం మాత్రం ప్రకృతి సిద్ధమైన మన ప్రాచీన జీవనశైలి వైపు అడుగులు వేస్తోంది.”యాంటీ బాక్టీరియల్ గుణాలు కల్గిన ప్రకృతి ప్రసాదించిన ఎంతో ప్రయోజనకరమైన వృక్షం వేప చెట్టు. టెక్ నిపుణుల నుంచి హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్ల వరకు అందరూ ఇప్పుడు “నేచురల్ ఓరల్ కేర్” ఉత్తమమని నినదిస్తున్నారు. మన పెరట్లో ఉచితంగా దొరికే వేప చెట్టు కొమ్మలను విరగ్గొట్టి పళ్ళు తోముకుంటాం. కానీ ఎంతో అమూల్యమైన వేప వృక్ష సంపదను మనం సరిగ్గా గుర్తించకపోవడం వల్ల వేపకు తెగులు సోకి ఒక్కోక్కటి చనిపోతుందని గ్రహించలేకపోతున్నాం.

వేప కు ఏమైందీ..?

Advertisement

ఈ మధ్యకాలంలో వేపచెట్లు అక్కడక్కడ ఎండిపోయి, ఆకులు రాలిపోతున్నాయనే వార్తలందుతున్నాయి. వైరస్ సోకిన కారణంగా ఆకు రాలుతుందని పలువురు చెబుతున్నారు .

“డై బ్యాక్” అనే తెగులు వల్లే..

కార్బన్ డై ఆక్సైడ్ తీసుకోని మనకి స్వచ్ఛమైన (ఆక్సిజన్) గాలి ఇచ్చే వేప చెట్టుకి ఏ వైరస్ సోకింది. పగలు రాత్రి ఆక్సిజన్ అందించి గాలిని శుద్ధి చేసే సహజ క్రిమిసంహారిని వేప చెట్టు. ప్రస్తుతం “డై బ్యాక్” అనే తెగులు వల్ల వేప చెట్లు ఎండిపోతు న్నాయి. చెట్టుకు చుట్టూ మూడు అడుగుల దూరంలో పాదు చేసి ఎక్కువగా నీరు పోయాలి. కాపర్ ఆక్సి క్లోరైడ్ (Tata Blitax ) ఒక లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేయాలి. మొదట్లో కూడా మందు పోయాలి. తెగులు ద్వారా రాలిపోయిన ఎండిన ఆకులను చెట్టు కు పది అడుగుల దూరంలో వేసి నిప్పు అంటించాలి.దీంతో ఆకులపై ఉండే తెగులు వ్యాప్తి చేసే పురుగులు చనిపోతాయి. కొన్ని చోట్ల తెగులు సోకిన కొమ్మలు మళ్ళీ వాటంతా అవే కొత్త చిగుర్లతో మళ్ళీ పచ్చదనా న్ని అందుకుందని కూడా చెబుతున్నారు.వాతావరణం లోని మార్పులని వేప చెట్టు ముందే గ్రహిస్తదా? ప్రాణ వాయువు నిచ్చేవేపకు ప్రాణం పోయాలి. మన సంప్రదాయాలకు ఉన్న విలువను గుర్తించాలి. వేప లక్ష్మీ స్వరూపమని భావిస్తూ, తొక్కటం లాంటివి చేస్తామని వేపకర్రతో గడప కూడా పెట్టరు. వేప చెట్ల ను నరికి వేయకుండా చూడాల్సిన బాధ్యత అందరి పైన ఉంది.

Advertisement

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ..!

మన పెరటి వేప పుల్ల.. విదేశాల్లో ‘లగ్జరీ’ బ్రష్..!

మనం పెరట్లో ఉచితంగా దొరికే వేప చెట్టు కొమ్మలను విరగ్గొట్టి పళ్ళు తోముకుంటే.. విదేశీయులు మాత్రం అదే వేప పుల్లల కోసం వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. మన సంప్రదాయ వేప పుల్ల ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై “ఆర్గానిక్ నేచురల్ టూత్ బ్రష్” పేరుతో ఒక విలాసవంతమైన వస్తువుగా మారిపోయింది.

మార్కెట్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రస్తుతం అమెజాన్ వంటి గ్లోబల్ ఈ-కామర్స్ సైట్లలో వేప పుల్లలకు డిమాండ్ ఉంది. సుమారు 20 వేప పుల్లల ప్యాక్ ధర కొన్ని చోట్ల రూ. 160 వరకు ఉంటే, అమెరికాలోని ప్రీమియం స్టోర్లలో వీటిని ప్యాక్ చేసి ఏకంగా రూ. 2,000 ధరకు విక్రయిస్తున్నారు.

బ్రాండింగ్ మాయాజాలం

“ఎకో-ఫ్రెండ్లీ”, “కెమికల్ ఫ్రీ”, “బయోడిగ్రేడబుల్” అనే ట్యాగ్‌లతో మన వేప పుల్ల వెస్ట్రన్ మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.
న్యాచురల్ యాంటీ-బయోటిక్: వేపలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికర బ్యాక్టీరియాను అంతం చేస్తాయి.
చిగుళ్ల పటుత్వం: కృత్రిమ బ్రష్‌లు ఇచ్చే దానికంటే ఎక్కువ దృఢత్వాన్ని చిగుళ్లకు ఇస్తుంది.
దుర్వాసన దూరం: నోటి దుర్వాసనను అరికట్టడంలో వేపను మించిన ప్రత్యామ్నాయం లేదని శాస్త్రీయంగా నిరూపితమైంది.

Also Read: 1064 నెంబర్ కొడితే కటకటాలే.. దెబ్బకు జంకుతున్న ప్రభుత్వ అధికారులు

Related News

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

Big Stories

Advertisement
×