E-Paper
Advertisement

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!
Advertisement

Viral Video: స్వేచ్చ బ్యూరో: సోషల్ మీడియాలోరవాణాశాఖకు సంబంధించిందంటూ వైరల్ అవుతున్న వీడియోపై సమగ్ర విచారణ చేస్తున్నామని నిజామాబాద్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. 2020–2022 మధ్య కాలానికి సంబంధించినదై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం రవాణాశాఖ దృష్టికి వచ్చిందన్నారు. వీడియోలో కొంతమంది మాస్కులు ధరించి ఉన్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇది కోవిడ్‌-19 కాలానికి సంబంధించినదై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. వాహనానికి సంబంధించి నెంబర్ ప్లేట్ సైతం లేదన్నారు.

ఏమైనా సంబంధం ఉందా?

వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడిందని, దానికి రవాణాశాఖతో ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలను నిర్ధారించాల్సి ఉందని, ఈ అంశాలపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. రవాణాశాఖలో ఎవరైనా అవినీతి లేదా ఇతర అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయమైన సమాచారం లేదా ఆధారాలు అందినట్లయితే, వాటిని సమగ్రంగా పరిశీలించి, ఆరోపణలు నిర్ధారణ అయిన పక్షంలో నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ నెల 17న దశరథ్, భాస్కర్ అనే ఇద్దరు హోంగార్డులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వారిని వారి మాతృశాఖకు సరెండర్ చేశామని, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు, ఈ చర్యకు ఏదైనా సంబంధం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలించడం జరుగుతోందని వెల్లడించారు.

విచారణలో..

Advertisement

ఈ విషయంపై ఉన్నతాధికారులు నివేదిక కోరిన నేపథ్యంలో, వీడియోకు సంబంధించిన వాస్తవాలు, దాని మూలం, కాలం, సందర్భం, అలాగే రవాణాశాఖతో దాని సంబంధంపై విచారణ చేపట్టడం జరుగుతోందన్నారు. విచారణలో వెల్లడయ్యే వివరాల ఆధారంగా సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, విచారణలో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా, ప్రజలు వాస్తవాలు నిర్ధారించుకోకుండా నిరాధారమైన సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరారు. ఈ వీడియోకు సంబంధించి లేదా రవాణాశాఖలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలకు సంబంధించి ఎవరి వద్దనైనా విశ్వసనీయమైన సమాచారం లేదా ఆధారాలు ఉంటే, వాటిని సంబంధిత రవాణాశాఖ అధికారులకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అవినీతిని రవాణాశాఖ ఉపేక్షించదని, ఆధారాలతో కూడిన ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఆరోపణలు నిర్ధారణ అయితేచట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also read: తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

Tags

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×