E-Paper
Advertisement

Anantapur Urban Politics: గురునాథ్ రెడ్డి ఎంట్రీ.. వెంకట్రామిరెడ్డి షాక్?

Anantapur Urban Politics: గురునాథ్ రెడ్డి ఎంట్రీ.. వెంకట్రామిరెడ్డి షాక్?
Advertisement

Anantapur Urban Politics: ఎప్పుడో పదేళ్ల క్రితం నుంచి అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురానాథ్‌రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు…సడన్ గా కొత్త సంవత్సరం రోజున మీడియా ముందుకు వచ్చి ఈ సారి తప్పకుండా పోటీలో ఉంటా అంటూ సంచలన ప్రకటన చేశారు… అయితే ఎప్పుడో పదేళ్ల క్రితం ప్రత్యక్షరాజకీయాలకు దూరమైన ఆయన.. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగా… ఇప్పుడే ఎందుకు తన పొలిటికల్ రీఎంట్రీపై ప్రకటనలు చేస్తున్నారు? దీని వెనుక ఏదైన ప్లాన్ ఉందా?

అనంతపురం వైసీపీ ఇన్చార్జ్ వెంకట్రామిరెడ్డికి ఇంటిపోరు

అనంతపురం అర్బన్ వైసిపి ఇన్చార్జ్ అనంత వెంకట్రామిరెడ్డికి ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉండగానే ఇంటి పోరు మొదలైనట్లు కనిపిస్తోంది ఇప్పటికే సొంత పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ఉన్నామంటూ పలువురు నాయకులు క్యూలోకి వస్తున్నారు… తాజాగా మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కూడా తాను రాబోయే ఎన్నికల రేసులో ఉన్నానని చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి … మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డికి దివంగత వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి…

గురునాథ్‌రెడ్డికి వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు

Advertisement

బి. గురునాథరెడ్డి రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తన సోదరుడు బి. నారాయణ రెడ్డి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో 2009లో అనంతపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం 2012లో ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీని విడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బి. గురునాథరెడ్డి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

టీడీపీలో చేరి తిరిగి వైసీపీలోకి వచ్చిన ‘గురు’

ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ప్రభాకరచౌదరి చేతిలో పరాజయం పాలయ్యారు. తర్వాత వైసీపీ సీజీసీ సభ్యుడిగా నియమితులయ్యారు] గురునాథరెడ్డి 2017 నవంబర్ 30న వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం 2018లో తిరిగి వైసీపీ గూటికి తిరిగొచ్చారు. పార్టీలు మారి వచ్చిన ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. దాంతో 2019 ఎన్నికల్లో అనంత వెంకటరామిరెడ్డికి వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం దక్కి విజయం సాధించారు. స్పాట్

వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం పోటీ చేస్తుందని ప్రకటన

Advertisement

ఆ క్రయంలో గడిచిన పది సంవత్సరాలుగా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా మౌనంగా ఉన్నానని… ఇక రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్దమని గురునాథరెకడ్డి సంచలన ప్రకటన చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రత్యక్ష రాజకీయాల్లో తమ కుటుంబం ఉంటుందని… రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తమ కుటుంబం పోటీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

అర్బన్ నియోజకవర్గంలో వైసీపీ టికెట్ కోసం ప్రయత్నాలు

ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం ఆ పార్టీ శ్రేణులను గందరగోళ పరుస్తోంది.. ఇప్పటికే అనంతపురం అర్బన్ వైసీపీ ఇన్చార్జిగా అనంత వెంకట్రామిరెడ్డి ఉండగా… మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే అనంతపురం అర్బన్ నియోజకవర్గం లో డజన్ల కొద్దీ లీడర్లు వైసిపి టికెట్ కోసం తమతమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు … మరి ఇలాంటి తరుణంలో ఒక ఔట్ డేటెడ్ లీడర్ అయిన గురునాథరెడ్డికి చాన్స్ దక్కుతుందా అన్నది చూడాలి.

Story by Ajay, Big Tv 

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×