E-Paper
Advertisement

నువ్వు మొగోడివైతే చర్చకు రా.. బండి సంజయ్‌కి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్

నువ్వు మొగోడివైతే చర్చకు రా.. బండి సంజయ్‌కి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్
Advertisement

Kaushik Reddy: కరీంనగర్ రాజకీయాలు ఇప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన సంధించిన విమర్శలు అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.

ముఖ్యంగా, బండి సంజయ్ తీరుపై కౌషిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బండి సంజయ్‌కు మధ్య ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందన్నట్టుగా ఆయన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఏది చెబితే సంజయ్ అదే మాట్లాడుతున్నారని, ఆయన బీజేపీ కంటే రేవంత్ రెడ్డి ఎజెండానే ఎక్కువగా మోస్తున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో తన ఆఫీసుకి కూతవేటు దూరంలో భారీ దోపిడీ జరిగితే, కనీసం దానిపై రివ్యూ కూడా చేయలేని స్థితిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఉన్నారని విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా శాంతిభద్రతల వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

Advertisement

గత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన భార్య పుస్తెలు అమ్మి ప్రచారం చేసుకున్నానని చెప్పిన సంజయ్, కార్పొరేషన్ ఎన్నికల నాటికి రూ. 50 కోట్లు ఎలా ఖర్చు చేశారని కౌషిక్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ స్థాయి గురించి మాట్లాడే ముందు తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని, కేవలం మోదీ వేవ్‌లో గెలిచినంత మాత్రాన గొప్ప నాయకుడివి అయిపోవని చురకలు అంటించారు.

‘నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే కరీంనగర్ అభివృద్ధిపై లేదా సబ్జెక్టుపై కేటీఆర్‌తో చర్చకు రా’ అంటూ సవాల్ విసిరారు. చివరగా వ్యక్తిగత విమర్శలకు దిగుతూ.. డ్రగ్స్, తంబాకు తీసుకోవడం వల్లే బండి సంజయ్ జుట్టు ఊడిపోయిందని, దమ్ముంటే కేటీఆర్‌లాగే డ్రగ్స్ టెస్టుకు సిద్ధం కావాలని కౌషిక్ రెడ్డి సవాల్ విసరడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Also Read: మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. బూడిదైన ‘ఫర్నిచర్ హోమ్స్’ షోరూమ్!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×