Parking Problem: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ వద్ద పార్కింగ్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ఆసుపత్రికి వచ్చే వాహనాలకు పార్కింగ్ కు యాజమాన్యం తగు ఏర్పాట్లు చేసుకోలేదు. దీంతో వచ్చే రోగులు, వారి బంధువులు వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేస్తున్నారు. అసలే ఆస్పత్రి జాతీయ రహదారికి అనుకుని ఉండటంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. తరచూ వాహనాల రద్దు ఎక్కువై, ప్రమాదాలు జరిగినప్పుడు ట్రాఫిక్‌తో స్తంభిస్తోంది. ఒక్కోసారి అంబులెన్స్ లు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఆసుపత్రి ముందు నెలకొంటే ఆస్పత్రి వానాల పార్కింగ్ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. ఆసుపత్రి వద్ద ప్రత్యేక పార్కింగ్ స్థలం లేకపోవడంతో కార్లు, బైకులు రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. దీంతో రహదారి ఒక వైపు పూర్తిగా మూసుకుపోతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. అత్యవసరంగా వచ్చే అంబులెన్స్‌లు కూడా కొన్నిసార్లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఆలస్యంగా ఆసుపత్రికి చేరుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రాణాలతో పోరాడుతున్న రోగులను తీసుకువచ్చే అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వలేని పరిస్థితిని ఆ స్పత్రి కల్పించకపోవడం లేకపోవడం బాధాకరం” అని స్థానికుడు ఒకరు తెలిపారు.
ఆసుపత్రి పరిసరాల్లో నివసించే ప్రజలు ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో రోడ్డు పూర్తిగా కిక్కిరిసిపోతుంది. విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Earthquake: తెలంగాణలో భూకంపం.. భయందోళనలో జనం
ఆసుపత్రికి పార్కింగ్ లేకపోవడం తో రోగులను చూడటానికి వచ్చే స్నేహితులు, బంధువులు వానలో పార్కింగ్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. పార్కింగ్ కోసం చుట్టుపక్కల వీధుల్లో తిరగాల్సి వస్తోంది. కొందరు దూరంగా వాహనాలు నిలిపి నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు ఎక్కడో వాహనాలు పార్కింగ్ చేసి ఇక్కడికి రావడం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేటప్పుడు సరైన పార్కింగ్ సౌకర్యం తప్పనిసరి. అయితే ఇక్కడ ఆ నిబంధనల నుంచి ఆదిత్య హాస్పిటల్ ను విస్మరించారా అనే సందేహం వ్యక్తం అవుతుంది. భవన నిర్మాణ నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే సంబంధిత అధికారులు ఎలా అనుమతిస్తారు స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఆదిత్య ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకునేలా ట్రాఫిక్ పోలీస్ లు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. , ట్రాఫిక్ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టి లో పెట్టు కొని, అధికారుల స్పందించాలని కోరుతున్నారు.
Also Read; Devotional news: నవరాత్రి పూజల నుంచి నిత్యార్చన వరకు.. ఎరుపు రంగుకు ఎందుకంత ప్రాముఖ్యత