E-Paper
Advertisement

హాట్ సీన్స్… అంతకుమించిన థ్రిల్… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ ఎరోటిక్ కామెడీ డ్రామా

హాట్ సీన్స్… అంతకుమించిన థ్రిల్… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ ఎరోటిక్ కామెడీ డ్రామా
Advertisement

Erotic Dark Comey Thriller: సాధారణ యువకుడి జీవితంలోకి ఓ ఫేమస్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇస్తే ? ఆమె కేవలం బాస్ మాత్రమే కాకుండా తనను ఆ పని కోసం ఎంచుకుంటే ? మొదట కలలా అనిపించిన ఆ అవకాశం కాస్తా కోరికలు, పవర్ గేమ్, రిలేషన్‌షిప్ సమస్యలు, చివరికి మర్డర్ వరకు వెళ్లిపోతే ? ఎరోటిక్ కామెడీ, సస్పెన్స్, డార్క్ థ్రిల్ కలిసిన ‘I Want Your Sex’ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్ అవుతోంది. గ్రెగ్ అరాకి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓ యువకుడు ఊహించని సంబంధంలోకి అడుగు పెట్టిన తర్వాత, అతని జీవితం ఎలా అదుపు తప్పుతుందో చూపిస్తుంది. మరి అసలు ఆ ఆర్టిస్ట్ అతన్ని ఎందుకు ఎంచుకుంది ? ప్రేమ, కోరిక, అధికారాల మధ్య అతను ఎలా చిక్కుకున్నాడు ? చివరికి ఈ వ్యవహారం మర్డర్ వరకు ఎందుకు వెళ్లింది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఎలియట్ ఓ యువకుడు ఇందులో హీరో. అతని ఊహలకు కూడా అందని అవకాశం ఒక్కసారిగా వచ్చి పడుతుంది. అతని బాస్, పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్ ఎరికా ట్రేసీ… అతన్ని తన సెక్సువల్ మ్యూస్‌గా ఎంచుకుంటుంది. మొదట ఈ ఆఫర్ ఎలియట్‌కు కలలా అనిపిస్తుంది. తన జీవితంలో ఇలాంటి అనుభవం వస్తుందని అతను ఊహించడు. కానీ ఆ కొత్త సంబంధంలోకి అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు క్రమంగా మారిపోతాయి.

Advertisement

ఎరికాతో ఏర్పడిన ఈ సంబంధం ఎలియట్‌లోని కోరికలను మాత్రమే కాదు, తన వ్యక్తిగత జీవితంపై ఉన్న ఆలోచనలను కూడా మార్చేస్తుంది. అప్పటికే అతనికి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంటుంది. ఆమెతో ఉన్న రిలేషన్‌షిప్, ఎరికాతో పెరుగుతున్న సాన్నిహిత్యం మధ్య ఎలియట్ మానసికంగా గందరగోళంలో పడతాడు. ఒకవైపు కొత్త అనుభవం అతన్ని ఆకర్షిస్తుంటే, మరోవైపు తాను ఎక్కడికి వెళ్తున్నానో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఎలియట్ అనుకున్నంత సింపుల్‌గా ఈ సంబంధం ఉండదు. కోరికలు, పవర్, డిజైర్ చుట్టూ మొదలైన ఆటలోకి మర్డర్ కూడా వచ్చి చేరుతుంది. తనకు ఎదురవుతున్న పరిణామాల నుంచి ఎలియట్ బయట పడాలంటే తాను నమ్మిన వ్యక్తులనే అనుమానించాల్సి వస్తుంది. ఎరికా అసలు ఉద్దేశం ఏంటి ? ఎలియట్‌ను ఆమె ఎందుకు తన ప్రపంచంలోకి తీసుకొచ్చింది ? ఈ సంబంధం వెనుక దాగి ఉన్న ప్రమాదం ఏంటి ? చివరికి మర్డర్‌కు ఎవరు కారణం ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలైన థ్రిల్.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

గ్రెగ్ అరాకి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఒలీవియా వైల్డ్, కూపర్ హాఫ్‌మన్, మేసన్ గూడింగ్, చేజ్ సూయి వండర్స్, చార్లీ ఎక్స్‌సీఎక్స్, డేవీడ్ డిగ్స్ తదితరులు నటించారు. సినిమా రన్‌టైమ్ సుమారు 1 గంట 30 నిమిషాలు. కామెడీ, సస్పెన్స్, డార్క్ థ్రిల్‌తో పాటు ఎరోటిక్ కంటెంట్ ఉండటంతో ఇది పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన R-rated మూవీ. Prime Videoలో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో మాత్రం లేదు. ఎరోటిక్ థ్రిల్, డార్క్ కామెడీ, రిలేషన్‌షిప్ డ్రామా, మర్డర్ మిస్టరీ కలిసిన అడల్ట్ కంటెంట్ కోసం ఓటీటీలో వెతుకుతున్న వాళ్ళకు ఇదొక డిఫరెంట్ థ్రిల్లింగ్ రైడ్.

Read Also: నామోషీగా భావిస్తే జీవితం నాశనమే… గ్రౌండ్‌లో చెమట కాదు రక్తం చిందేలా పోరాటం

Related News

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న మైండ్ బెండింగ్ సైకలాజికల్ హారర్… ఏ ఓటీటీలో ఉందంటే ?

ఆ పాత భవంతిలో ఉంటే చస్తారు… దెయ్యాల కోట వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీ స్ట్రీమింగ్ తెలుగులో

కంటికి కనిపించని రాక్షస శక్తులు… అర్ధరాత్రి ఈ హారర్ చూస్తే గుండె ఆగిపోవాల్సిందే

ఆమె గుర్తొస్తే గుండెల్లో కోత… కన్నీళ్లు పెట్టించే అందమైన ప్రేమ ప్రయాణం

నామోషీగా భావిస్తే జీవితం నాశనమే… గ్రౌండ్‌లో చెమట కాదు రక్తం చిందేలా పోరాటం

Big Stories

Advertisement
×