E-Paper
Advertisement

Hyderabad Voters: ఓటెత్తుతోన్న గ్రామీణం.. సిటీ ఓటర్లూ మేల్కోండి.. ఓటే మన వజ్రాయుధం

Hyderabad Voters: ఓటెత్తుతోన్న గ్రామీణం.. సిటీ ఓటర్లూ మేల్కోండి.. ఓటే మన వజ్రాయుధం
Advertisement

Hyderabad Voters: సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధుల్ని గల్లా పట్టుకుని నిలదీసే సిటీ ఓటర్లు.. పోలింగ్ బూత్‌లకు వెళ్లడానికి మాత్రం బద్దకిస్తున్నారు. ఓటు వజ్రాయుధం అనే విషయాన్ని మరిచిపోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో నమోదైన ఓటింగ్ శాతం దారుణంగా ఉంది. దిగువ నుంచి టాప్ ప్లేస్‌లో నిలుస్తున్నాయి ఈ మూడు జిల్లాలు. 1 గంటకు హైదరాబాద్ జిల్లాలో కేవలం 20.79 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26.70 శాతం, రంగారెడ్డి జిల్లాలో 29.79 శాతం పోలింగ్ రికార్డయింది. అటు గ్రామీణ తెలంగాణ మాత్రం ఓటెత్తుతోంది. మెదక్ జిల్లాలో మాత్రం 50.80శాతం ఓటింగ్ నమోదుకాగా.. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో 41.88 శాతం పోలింగ్ నమోదైంది.

ఈ విషయంలో సెలబ్రిటీలు ఆదర్శంగా నిలిచారు. వెండితెర వేల్పులు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుమంత్.. అందరికంటే ముందు పోలింగ్ బూత్‌లకు వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో వణికించే చలిని సైతం లెక్కచేయకుండా.. కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Advertisement

హైదరాబాద్‌ పాతబస్తీలో పోలింగ్‌ చాలా మందకొండిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ యావరేజ్‌తో పోలిస్తే దాదాపు సగంగానే ఉంది. పోలింగ్ మొదలై 7 గంటలు దాటినా పావువంతు కూడా ఓట్లు పడలేదు. యాకుత్‌పురా నియోజకవర్గం పరిధిలో అత్యల్పంగా 12.4 శాతమే పోలింగ్‌ నమోదైంది. గోషా మహల్‌లో 15.8 శాతం, చాంద్రాయణగుట్టలో 16 శాతం, చార్మినార్‌లో 17.7 శాతం, మలక్‌పేటలో 18.3 శాతం, నాంపల్లిలో 18.6 శాతం, బహదూర్‌పురాలో 20 శాతం, కార్వాన్‌లో 25.3 శాతం నమోదైంది. పోలింగ్ తక్కువగా జరుగుతున్న నియోజకవర్గాల్లో MIM సిట్టింగ్ స్థానాలే ఎక్కువగా ఉన్నాయి.

పాతబస్తీ ఓటర్ల నిరాసక్తతకు కారణం ఏంటి అనేది చర్చగా మారింది. ఓట్లు వేయాలన్న ఆసక్తి స్థానికులకు లేదా? వారిని ఎవరైనా ఓట్లు వేయకుండా ఆపుతున్నారా ? అన్న సందేహాలొస్తున్నాయి. ఓటర్లు ఇళ్లలోనే ఉండకుండా.. గడపదాటి బయటికొచ్చి ఓటు అనే ఆయుధంతో.. తమ నేతలను ఎన్నుకోవాలని టాలీవుడ్ ప్రముఖులు పిలుపునిస్తున్నారు.

Advertisement

ఓటు మన ఆయుధం. వజ్రాయుధం. ఓటు వేస్తేనే పాలకుల్ని, నేతల్ని నిలదీసే అర్హత వస్తుంది. సోషల్ మీడియాలో మస్త్ యాక్టివ్‌గా కనిపించే టెక్కీలు, యూత్ గడప దాటి రావాలి. ఓట్లతో పోటెత్తాలి. అప్పుడే మన బాధ్యత నెరవేర్చినట్టు. పాలకుల్ని నిలదీసే హక్కు పొందినట్టు. బిగ్‌ టీవీ మళ్లీ మళ్లీ చెప్తోంది. బాధ్యత గుర్తెరగండి. ఓటెత్తండి. విద్యావంతులుగా అందరికీ ఆదర్శంగా నిలుద్దాం.

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×