E-Paper
Advertisement

EC : కోడ్ ఉల్లంఘన.. కవిత, ఇంద్రకరణ్ రెడ్డిపై ఎఫ్ఐఆర్..

EC : కోడ్ ఉల్లంఘన.. కవిత, ఇంద్రకరణ్ రెడ్డిపై ఎఫ్ఐఆర్..
Advertisement

EC : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయంలో అనేక చోట్ల నేతలు కోడ్‌ ఉల్లంఘిస్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ నేతలు ఎక్కువ మంది ఉన్నారు. ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధంగా పొలిటికల్ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. ఇలాంటి లీడర్స్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్‌ ఫోకస్ చేసింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈసీ చర్యలు చేపట్టింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలుస్తోంది.

మరో తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఈవీఎంల సమస్య వచ్చిన చోట కొత్తవి ఇచ్చామని చెప్పారు. అర్బన్ ఏరియాల్లో పోలింగ్ మందకొడిగా జరుగుతుందని ప్రకటించారు. చెరుదుమదురుగా చిన్న ఘర్షణలు జరిగాయన్నారు. ప్రతి ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని డీఈవోను కోరామన్నారు. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చిందని వెల్లడించారు. ఆ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఆదేశాలు ఇచ్చామన్నారు . కవితపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిందన్నారు.

Advertisement

అసలు కవితపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదైందంటే.. ఓటు వేసిన ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దీంతో కవిత ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కాంగ్రెస్‌ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌ నేత నిరంజన్‌. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

అలాగే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఎల్లపెల్లిలో పార్టీ కండువాతో వచ్చి ఓటు వేశారని మంత్రిపై అధికారులు నిర్మల్ గ్రామీణ పీఎస్ లో ఫిర్యాదుచేశారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×