Ponnam Counter: తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘Yes పవన్ కళ్యాణ్.. ఇది మా అయ్య జాగిరే. 4 కోట్ల తెలంగాణ ప్రజల జాగీర్’ అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కు ఆంధ్రాలోనే దిక్కు లేదంటూ ఎద్దేవా చేశారు. గతంలో ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదన్న పొన్నం.. బీజేపీ-టీడీపీతో పొత్తు పెట్టుకొని గెలిచారని విమర్శించారు. ఆంధ్రాలోనే పవన్ కు దిక్కులేదని.. మళ్లీ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. ‘చనిపోయిన గద్దర్ గురించి మాట్లాడుతూ నేను కారు కొనిచ్చా అని చెప్పారు. తెలంగాణలో ఉన్న దళిత వర్గాలు ఆలోచన చేయాలి. ఆయన అహంకారం గమనించాలి. మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగా పోరాడమే.. అదే ఆధిపత్య ధోరణితో పవన్ మాట్లాడారు’ అని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్.. పాక్ లో ఉందా? ఇండియా ఉందా? అన్నట్లు పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ తన మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించారు.
Yes మిస్టర్ పవన్ కళ్యాణ్..ఇది మా అయ్యా జాగిరే … నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల అయ్యా జాగిరే.. నీ అయ్యా జాగిరి కాదు..
ముందు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి..
చనిపోయిన గద్దర్ గురించి మాట్లాడుతూ నేను కారు కొనిచ్చా అని చెప్తున్నాడు..
తెలంగాణ లో ఉన్న దళిత వర్గాలు… pic.twitter.com/KHXOrJBApz
— Ponnam Prabhakar (@Ponnam_INC) June 2, 2026
పార్లమెంటులో తలుపులు వేసి తెలంగాణ బిల్లు తెచ్చుకున్నారని పవన్ వ్యాఖ్యానించడం ఈ రాష్ట్రంలో అతడి అక్కసుకు నిదర్శనమని పవన్ అన్నారు. తెలంగాణ మీద ప్రేమ ఉందని చెప్పే పవన్.. ఈ రాష్ట్రానికి మద్దతుగా ఎప్పుడైనా మాట్లాడారా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే ఎప్పుడైనా సంఘీభావం తెలిపావా? అంటూ నిలదీశారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పింది మీరు కాదా? అని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు అవమానించిన వ్యక్తి పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేనాని ఒక పెయిడ్ ఆర్టిస్టు అని.. అయితే ఆయనకు వచ్చే చిట్టీలు బీజేపీ లేదా బీఆర్ఎస్ లలో ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదని మంత్రి పొన్నం అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారని పొన్నం తెలిపారు. పవన్ కొండకట్టుకు వస్తే.. తెలంగాణ అతిథిగా భావించి ప్రోటోకాల్ ఇచ్చామన్నారు. మరోవైపు తెలంగాణలో నవనిర్మాణ సభ పెట్టి పవన్ పీకేది ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలోని సరిగ్గా ఏమీ పీకలేకపోతున్నారని సెటైర్లు వేశారు.
Also Read: పవన్ సంచలన ప్రకటన.. తెలంగాణలో జనసేన పోటీ.. తేల్చుకుందామని సవాల్!
పవన్ కళ్యాణ్.. తెలంగాణకు రావడానికి పోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్న పొన్నం ప్రభాకర్.. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి గెలుకుతామంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. గద్దర్ ఆత్మకు పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. తెలంగాణలో ఆంధ్రావాళ్లకి పనిలేదని తాము ఎక్కడా చెప్పడం లేదని మంత్రి పొన్నం అన్నారు. ఇది ఫెడరల్ సిస్టమ్ అన్న ఆయన.. హైదరాబాద్ లో అన్ని రకాల భాషల వాళ్లు ఉంటారని స్పష్టం చేశారు. అనవసరంగా పవన్ తన మాటలతో వారిని గెలకవద్దని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ కావాలంటే గుజరాత్ వెళ్లి పార్టీ పెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.
Also Read: ‘మీరెవరు రావొద్దనడానికి.. తెలంగాణ మీ అయ్య జాగీరా’.. పవన్ సంచలన వ్యాఖ్యలు