
Raja Singh | వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఎప్పుడూ బిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడే రాజా సింగ్ ఈ సారి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేశారు. బీజేపీ నేతలెవరైనా తనకు వ్యతిరేకంగా పని చేస్తే వారిని వదిలే ప్రసక్తే లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
గత కొద్ది రోజులుగా సొంత పార్టీ నేతలే తన వెనుక గొయ్యి తవ్వుతున్నారని ఆయన ఆరోపించారు. వారందరికీ ఆయన హెచ్చరించారు. తన వ్యూహాలను సొంత మనుషులే తన ప్రత్యర్థులకు చేరవేస్తున్నారంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి నుంచి వేరే పార్టీలకి సమాచారం ఇస్తే అక్కడి వారు ఇక్కడకి సమాచారం ఇస్తారు మరిచిపోకండి అని చెప్పారు. ఎన్నికల తర్వాత మోసం చేసే వారి అంతు చూస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో జరగబోయే ఎన్నికలు తనకు జీవన్మరణ సమస్య అని రాజాసింగ్ తెలిపారు. చావడానికి భయపడను చంపడానికి భయపడను అని రాజాసింగ్ సొంత పార్టీనేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. 2018లో తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారి జాబితా తన వద్ద ఉందని పేర్కొన్నారు. తన ప్రత్యర్థులతో ఎవరు టచ్‌లో ఉంటారో తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. నమ్మక ద్రోహం చేస్తే వారికి ఎన్నికల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు.