
Shreyas Iyer-Shubman Gill : టీమ్ ఇండియా ఎప్పుడూ లేనంత సమతుల్యతగా ఉంది. అటు సీనియర్లు, ఇటు జూనియర్లతో కళకళలాడుతోంది. రోహిత్, కోహ్లీ, మహ్మద్ షమీ టాప్ సీనియర్లు కాగా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, బుమ్రా, కుల్దీప్ వీళ్లు మధ్యస్తం సీనియర్లుగా ఉన్నారు. శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్, సిరాజ్ వీరు యువతరం. అయితే ఇప్పడు బ్యాటింగ్ లో నువ్వా? నేనా? అన్నట్టు ఆడుతున్న శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ రేపు భారత్ భవిష్యత్ క్రికెట్ కు ఆశా కిరణాల్లా ఉన్నారు.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా కివీస్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ఫైనల్ కి చేరింది. ఈ క్రమంలో ప్లేయర్లు అందరూ మాట్లాడుతున్నారు. అలా యువ ఆటగాళ్లు గిల్, శ్రేయాస్ కూడా స్పందించారు. అయితే వారు మాట్లాడుతూ తమకి ఇన్సిపిరేషన్ ఎవరో చెప్పారు. ఒక కొత్త వివాదానికి తెర లేపారు.
గిల్ మాట్లాడుతూ నాకు కోహ్లీ ఇన్సిపిరేషన్ అని చెప్పాడు. తను గ్రౌండ్ లో ఉంటే ఏదొకటి సాధించాలనే తపనతో ఉంటాడు. అనుక్షణం ఆకలితో ఉంటాడు. దేశం కోసం ఆడాలనే కసి అణువణువునా కనిపిస్తుంది. ఆ ఇంటెన్సిటీ అంటే నాకు చాలా ఇష్టం. గ్రౌండ్ లోకి వెళ్లిన తర్వాత కోహ్లీ ఆట చూసి ఇన్ స్పైర్ అవుతుంటానని తేల్చేశాడు. తన ఆల్ టైమ్ ఫేవరెట్ కోహ్లీ అని అన్నాడు.
మరోవైపు శ్రేయాస్ ఏమన్నాడంటే, నా అనుభవంలో భయమన్నదే ఎరుగుని ఆటగాడు, కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పి ఆకాశానికెత్తేశాడు. తను గ్రౌండ్ లో ఉన్నాడంటే స్కోరు బోర్డు పరుగులెడుతుంది. అసలు సెమీఫైనల్ మ్యాచ్ గెలిచిందంటే అతనే కారణం. ఆయనిచ్చిన బిగినింగ్ మీదే మేం అందరం స్కోరు బోర్డుని ముందుకు తీసుకెళ్లాం. అదే ఆయన ఆ పికప్ ఇచ్చి ఉండకపోతే అందరూ డిఫెన్స్ ఆడుతూ ఉండేవారని చెప్పాడు.
ఒక్క బ్యాటింగ్ లోనే కాదు కెప్టెన్సీలో కూడా చాలా రిస్కీ డెసిషన్స్ తీసుకుంటాడు. చాలా ధైర్యంగా బౌలర్లను మార్చుతాడు. అవతల బ్యాటర్లు రెచ్చిపోతుంటే, ఈయన వారి ముందు స్పిన్నర్లను ప్రయోగిస్తుంటాడు. ఆ తెగింపు అంటే నాకు చాలా ఇష్టమని అన్నారు.
ఇద్దరు యువ క్రికెటర్లు ఇలా రెండు వైపులకి వెళ్లిపోవడంతో, ఇదేమైనా రాబోవు రోజుల్లో గ్రూపులు కట్టే అవకాశం ఉందా? అని కొందరు అంటున్నారు. లేదంటే గిల్, శ్రేయాస్ మధ్య అనారోగ్యకరమైన పోటీ గానీ నెలకొందా? ఇది భారతజట్టుకి మంచిది కాదని కొందరంటున్నారు.
ఎవరికి నచ్చిన ఆటగాళ్ల పేర్లు వారు చెప్పారు. దీనికెందుకంత దూరం తీసుకుపోతారని కొందరంటున్నారు. అయితే దీనికి మద్దతుగా కొందరు శ్రేయాస్ సెంచరీ చేయగానే గ్యాలరీ నుంచి రోహిత్ మంచి ఖుష్ తో తనని అనుకరిస్తూ మూమెంట్ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు.
మొత్తానికి యువ ఆటగాళ్ల ఇద్దరి వ్యవహార శైలి టీమ్ ఇండియాపై ప్రభావం చూపకుండా ఉండేలా చూడమని అప్పుడే కొందరు కామెంట్లు పెడుతున్నారు.
ipl 2023 commentary in Bhojpuri : ఐపీఎల్ భోజ్‌పురి కామెంటరీకి సూపర్ హిట్ టాక్.. చెప్పేది మన రేసుగుర్రం మద్దాల శివారెడ్డి