E-Paper
Advertisement

ఆడబిడ్డల చీరల్లో అవినీతి ..మీ బతుకు చెడా ..మీదీ ఒక బతుకేనా .. సీఎం రేవంత్ ఉగ్రరూపం !

ఆడబిడ్డల చీరల్లో అవినీతి ..మీ బతుకు చెడా ..మీదీ ఒక బతుకేనా ..  సీఎం రేవంత్ ఉగ్రరూపం !
Advertisement

Revanth Reddy Slams KCR:మూసారాంబాగ్‌ హై లెవల్‌ బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈరోజు ఘనంగా ప్రారంభించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో మూసీ నదిపై దాదాపు రూ.52 కోట్ల భారీ అంచనా వ్యయంతో 400 మీటర్ల పొడవునా నిర్మించిన వంతెనతో అంబర్‌పేట్‌ మరియు మూసారాంబాగ్ ప్రాంతాలలో ట్రాఫిక్ కి చెక్ పెట్టినట్టు అయింది.

ఇక ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసిఆర్ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు ఎందుకు పనికిరాని అసలు ఆ చీరలు కట్టుకొని బయటికి వచ్చే వారే కాదని ఊర్లలో పిట్టలని, అడవి పందులని రాకుండా భయపెట్టడానికి,పల్లి చేన్ల కాడ పందులను బెదరగొట్టడానికి,ఇళ్లలో పరదాలు గా కట్టడానికి ఆనాడు బతుకమ్మ చీరలను ఉపయోగించేవారు తప్ప ఆడవాళ్లు ఎవరూ కట్టుకునే వారు కాదని మండిపడ్డారు.

Advertisement

వారంతా కమిషన్లకి కక్కుర్తి పడి పండుగ పూట ఆడబిడ్డలకు పెట్టే బతుకమ్మ చీరల్లో కమిషన్లు మెక్కారు మీరు. మీ బతుకు చెడ మీది కూడా ఒక బతుకేనా, ఆడబిడ్డలకు పెట్టే చీరల్లో కూడా కమిషన్లు కొట్టేశారు ఈ దద్దమ్మలు సన్నాసులు ,అలాంటి వీరు నన్ను పట్టుకుని 1000 రోజుల పరిపాలన లో నేను వైఫల్యం చెందానని అంటున్నారు.

కోటి మంది ఆడబిడ్డలకు పాలపిట్టల రంగులల్లో ఉన్న ఇందిరమ్మ చీరలను ఇస్తే వాళ్ళ మా అక్క లందరూ మా తమ్ముడు పెట్టిన సారే.పుట్టింటి నుంచి వచ్చిన చీర అని ఇంతమంది ఆడబిడ్డలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చారని తెలిపారు.

Advertisement

వాళ్ళందరిని చూస్తుంటే దసరా పండగ నాడు వచ్చిన పాలపిట్టను చూసినట్టుంది. మీ బతుకు చెడ ఒక్కసారి మా అక్కలు కట్టుకున్న చీరలని చూడండి .కనీసం అలా అయినా మీ అందరికీ సిగ్గు వస్తుందని మండిపడ్డారు.

మీరందరూ వెయ్యి రోజుల్లో ప్రజా పాలన దివాలా తీసింది అని నన్ను అంటరా.. ఒక బతుకమ్మ చీర ఎలా ఉందో చూడండి. అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక మెతుకు చూస్తే అర్థమవుతుంది .మీ బతుకులు మీ బతుకమ్మ చీరల్లో ఉన్నాయి. మా గొప్పతనం ఈ ఇందిరమ్మ చీరల్లో కనిపిస్తుంది.

also read:రూ.8 లక్షల కోట్ల అప్పు.. ఇదే కేసీఆర్ మార్క్ పాలన: సీఎం రేవంత్

ఇది కూడా చూసి ఓర్వలేని సన్నాసులు ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతామని మాట్లాడతారా ..మా అక్కలకి 60,000 కోట్ల రూపాయలని స్వయం సహాయక సంఘాలలో బ్యాంకు లింకేజీ ఇప్పించాను .మా అక్కల తరపున 2100 రూపాయలని బ్యాంకులకు మిత్తి చెల్లించాను.
కొంతమంది బద్మాష్ గాళ్లు మా అక్కలకి బస్సులను ఇస్తే మా ఆటో డ్రైవర్ అన్న లని ఉసిగొల్పుతున్నారు. ఆ పథకాన్ని బందు చేయాలని ఉచితంగా ఇవ్వొద్దు,మా బతుకులు చెడిపోతున్నాయని వారిని ఎగదోస్తున్నారు.

అయినా నేను ఎక్కడ వెనుకకి పోలేదు కావాలంటే మీకు మంచి చేస్తాం తప్ప ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయమని చెప్పాను. బస్సులలో ఆడవాళ్లు ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు అని ఎగతాళి చేస్తే వాళ్ళకి వెయ్యి బస్సులను ఉచితంగా ఇప్పించాను. అలా వారికి నెలకు 75 వేల రూపాయలు దక్కేలా చేశాను అని చెప్పుకొచ్చారు .

also read:మూసారాంబాగ్‌ వంతెన వచ్చేసింది.. ఇక ఆ రూట్‌లో ట్రాఫిక్‌ బాధలు లేనట్టే!
అదేవిధంగా.. సోలార్ విద్యుత్ అంటే అదాని అంబానీ గుర్తుకొస్తారు,పెట్రోల్ బంక్ అంటే రిలయన్స్ గుర్తుకు వచ్చేది.అలాంటిది 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి జెన్కో కి పవర్ సప్లయ్ చేసే ఒప్పందాన్ని ఒప్పందం .అలాగే నగరాలలో, ప్రధాన జంక్షన్ లలో ఎంతో విలువైన భూములను ఇచ్చి ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునే విధంగా వసతులు కల్పించాం .అలాంటిది మమ్మల్ని అన్నేసి మాటలు అంటారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు సీఎం రేవంత్ !

Tags

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×