E-Paper
Advertisement

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌
Advertisement

బీఆరెస్ సోష‌ల్ మీడియాను స‌ర్కార్ త‌ట్టుకోలేక‌పోతున్న‌దా? అది విప‌రీతంగా అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తూ రేవంత్‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌దా? అంటే అవున‌నే అనాల్సి వ‌స్తోంది సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్‌ల‌ను చూసిన త‌రువాత‌. ఇటీవ‌ల ఏ స‌భ జ‌రిగినా బీఆరెస్ సోష‌ల్ మీడియాకు ఓ వార్నింగ్ ఇస్తున్నారాయ‌న‌. తోలు తీస్తానంటున్నారు. మిమ్మ‌ల్ని వ‌దిలేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు.

వార్నింగులకు వెనక్కి తగ్గని బీఆర్ఎస్ సోషల్ మీడియా

ఈ వార్నింగుల‌కు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు బీఆరెస్ సోష‌ల్ మీడియా. వీరికి కేటీఆర్ వెన్నుద‌న్నుగా నిలుస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. నెల‌కు కోట్లాది రూపాయ‌లు వెచ్చిస్తున్నారంటున్నారు. లీగ‌ల్‌గా కూడా వారికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు కేటీఆర్‌. అంతే కాదు.. వ‌చ్చేది మ‌న సర్కారేన‌నే ఓ భ‌రోసా ఇవ్వ‌డం ద్వారా బీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

చ‌తికిల‌బ‌డుతున్న కాంగ్రెస్ వారియ‌ర్స్‌

Advertisement

బీజేపీకి ఉన్న‌ట్టుగానే బీఆరెస్‌కు కూడా అభిమానులున్నారు. కేసీఆర్‌ను బాగా ఇష్ట‌ప‌డేవారు స్వచ్ఛందంగానే త‌మ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు. కౌంట‌ర్లిస్తున్నారు. దీనికి ధీటుగా స్పందించ‌లేక చ‌తికిల‌బ‌డుతోంది కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా. ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నా.. అవి కూడా ప‌రిమిత వ‌న‌రులతోనే ఉండ‌టం.. అంత యాక్టివ్‌గా స్పందించ‌లేక పోవ‌డంతో బీఆరెస్ వారియ‌ర్స్‌తో పోల్చితే ధీటుగా నిల‌బ‌డ‌లేక‌పోతున్నారు.

Also Read: ‘సొంత గడ్డకు వచ్చా.. కన్నీళ్లు ఆగట్లేదు’.. నిజామాబాద్ సభలో కవిత భావోద్వేగం!

సీఎం సీరియ‌స్‌.. కేటీఆర్ టీమ్‌కు వార్నింగ్‌..

Advertisement

అందుకే ఈ అంశం సీఎం రేవంత్ రెడ్డికి చిరాకు తెప్పిస్తున్న‌ట్టుంది. బ‌హిరంగ స‌భ‌ల వేదిక‌ల మీదే బీఆరెస్‌పై ఫైర్ అవుతూ వ‌స్తున్నారు. కేటీఆర్‌కు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు కూడా అప్పీలు చేసుకుంటున్నారు సీఎం. ఆ త‌ప్పుడు వార్త‌ల‌ను, అబ‌ద్ద‌పు ప్ర‌చారాల‌ను న‌మ్మొద్ద‌ని రిక్వెస్టు చేసుకుంటున్నారు. మ‌రోవైపు దీనిపై సీఎం ఆదేశాల‌తో సైబ‌ర్ క్రైమ్ సీరియ‌స్‌గా దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. బీఆరెస్ సోష‌ల్ మీడియాపై వేట మొద‌లైంద‌ని తెలుస్తోంది. వీరిపై చ‌ర్య‌లు తీసుకోకుంటే.. మున్ముందు మ‌రింత న‌ష్టం క‌లిగించ‌డం ఖాయ‌మ‌నే భావ‌న‌లో ఉంది రేవంత్ స‌ర్కార్‌.

– Written by Dandugula Srinivas, BIG TV

Tags

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×