BigTV English

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Nizamabad Student Dies in Road Accident in Philippines: ఉన్నత చదువుల కోసం ఎంతోమంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు. అయితే అక్కడ బాగా చదువుకొని తమ కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. అయితే కొంతమంది ఆశలు కలలుగానే మారుతున్నాయి. తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుంటారు. చాలామంది జాబ్, చదువు కోసమని వెళ్లి విదేశాల్లో మన భారతీయులు విగతజీవులుగా మారుతున్నారు.


కొంతమంది ప్రమాదాల బారీన పడి మరణిస్తుండగా.. మరికొంతమంది హత్యకు గురవుతున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం కలచివేస్తుంది. తాజాగా, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణకు చెందిన నిజామాబాద్ జిల్లాకు ఓ వైద్య విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి అక్షయ్ ఉన్నత చదువుల కోసం ఫిలిప్పీన్స్ దేశం వెళ్లారు. ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో 6 నెలల్లో ఎంబీబీఎస్ పట్టా అందుకుంటానని చెప్పిన కొన్ని రోజులకే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు వాపోయారు.


అక్షయ్ బైక్‌పై వెళ్తుండగా..ఎదురుగా రాంగ్ రూట్‌లో గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్షయ్‌కి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్షయ్ మృతితో నిజామాబాద్ జిల్లా వేల్పూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 15న కెనడా టొరంటోలో బర్త్ డే వేడుకలు చేసుకుంటుండగా చెరువులో పడి ప్రణీత్ మృతి చెందాడు. అయితే ప్రణీత్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఈనెల 23న ప్రణీత్ డెడ్ బాడీ హైదరాబాద్ రానుంది. కెనడా నుంచి 22న ఢిల్లీకి చేరుకుంటుదని అధికారులు చెబుతున్నారు.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×