Weather News: గడిచిన నాలుగు, ఐదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో అయితే కుండపోత వర్షం పడుతోంది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోమాయి. యూసఫ్ గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీల్లో వరదలు ముంచెత్తాయి. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా భాగ్యనగరంలో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఇప్పటీకీ వర్షం దంచికొడుతుంది. చాలా చోట్ల రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. పంజాగుట్ట, బేగంపేట, అమీర్ పేట, జూబ్లీహిల్స్, ప్యారడైజ్, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో వర్షం షురూ అయ్యింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. నగరవాసులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేస్తోంది. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడుతోంది.
మరో 2, 3 గంటల్లో భారీ వర్షం..
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరోసారి అలర్ట్ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా మళ్లీ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం దంచికొట్టే ఛాన్స్ ఉందని వివరించింది. ఇప్పటికే బోడుప్పల్, ఉప్పల్, మేడిపల్లి, రామాంతాపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్ పురాలో వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులో కూడిన వానలు పడతాయని హెచ్చరిచ్చింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో రాత్రంతా భారీ వర్షాలే..
ఇక భాగ్యనగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగనున్నట్టు చెప్పారు. రాబోయే మూడు గంటల్లో పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, హన్మకొండ, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు పేర్కొన్నారు.
పిడుగుల పడే ఛాన్స్..
హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో రాత్రివేళ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.
అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పైన పేర్కొన్న జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఆ జిల్లాల ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.
ALSO READ: Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు
ALSO READ: Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు