BigTV English

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Red corner notices to the accused in Phone Tapping Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఛానల్ ఎండీ శ్రవణ్ రావులకు త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఈ మేరకు ఆ ఇద్దరికి నోటీసులు అందించాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది.


ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిద్దిరికి రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి అందించాలని సీబీఐకి సిట్ లేఖ రాసింది. దీనిపై సీబీఐ స్పందించింది.

హైదరాబాద్ సిట్ పంపిన లేఖకు సీబీఐ అనుమతి మంజూరు చేసింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. అయితే, ప్రభాకర్ రావు అమెరికాలో గుండెకు సంబంధించిన చికిత్స కోసం వెళ్లగా.. శ్రవణ్ రావు మాత్రం ఇప్పటివరకు ఎవరికీ అందుబాటులోకి రాలేదని సిట్ బృందం వెల్లడించింది.


అయితే, ప్రభాకర్ రావుపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రభాకర్ రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతారని దర్యాప్తు బృందం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం దర్యాప్తు బృందం పంపిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ కేసు విషయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించగా.. ఆరోగ్యం బాగాలేనందున విచారణకు హాజరు కాలేనని సిట్‌కు ప్రభాకర్ రావు తెలిపారు. దీంతో ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావును హైదరాబాద్‌కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×