Rain News: హైదరాబాద్ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గత నాలుగు, ఐదు రోజుల నుంచి భాగ్యనగరంలో కుండపోత వర్షం పడుతోంది. మొన్న కురిసిన భారీ వర్షానికి యూసఫ్ గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీల్లో బైకులు, కారులు వరదల్లో సైతం కొట్టుకుపోయాయి. శనివారం రాత్రి కూడా భారీ వర్షం పడింది. చాలా చోట్ల రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. పంజాగుట్ట, బేగంపేట, అమీర్ పేట, జూబ్లీహిల్స్, ప్యారడైజ్, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. నగరవాసులన ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేస్తోంది. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడుతోంది.
మరో రెండు గంటల్లో భారీ వర్షం..
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరోసారి అలర్ట్ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా మళ్లీ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరో 2 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం దంచికొట్టే ఛాన్స్ ఉందని వివరించింది. ఇప్పటికే బోడుప్పల్, ఉప్పల్, మేడిపల్లి, రామాంతాపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్ పురాలో వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులో కూడిన వానలు పడతాయని హెచ్చరిచ్చింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
రానున్న 2 గంటల్లో నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు. తెలంగాణ 8 జిల్లాల్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని చెప్పారు.
ఏపీలోనూ భారీ వర్షాలు..
అటు ఏపీలోనూ రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉందని వివరించారు.
బయటకు రావొద్దు.. జాగ్రత్త..!
ఈ క్రమంలోనే భాగ్యనగర వాసులతో పాటు రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలకు బయటకు రావొద్దని హెచ్చరించింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ALSO READ: Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..