Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్ వార్ మొదలైందా? ఈ మధ్యకాలంలో గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయా? ప్రత్యర్థులపై కత్తులతో దాడులు చేస్తున్నాయా? ఆ తరహా దాడులతో ఆ ప్రాంత ప్రజల్లో భయం మొదలైందా? తాజాగా అలాంటి ఘటన ఒకటి పాతబస్తీలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది?
హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్ వార్
హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ గ్యాంగ్ వార్‌కు వేదికైంది. బుధవారం రాత్రి 8.45 నిమిషాలకు ఓ కిరణా షాపు వద్ద నున్న ఓ యువకుడిపై ఓ గ్యాంగ్ కత్తులతో దాడికి తెగబడడం కలకలం రేపింది. ఫాతిమా ఆసుపత్రి ప్రాంతంలోని కిరాణా షాపు వద్ద ఖుర్రామ్ అనే వ్యక్తి టూ వీలర్ ఉన్నాడు. తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నాడు.
అదే సమయంలో రౌడీ షీటర్ మొహమ్మద్ అసద్ తన సహచరులతో కలిసి ఆ వ్యక్తిపై కత్తులతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన చూసి స్థానికులు షాకయ్యారు. ఖయ్యం తన వాహనం ముందు పడిపోయాడు. ఖయ్యుం తన సోదరుడి కిరాణా దుకాణంలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. నలుగురు వ్యక్తులు చేతులో పదునైన వేట కొడవళ్లు పట్టుకుని రోడ్డుపై అటు ఇటూ తిరగడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు.
ఓ వ్యక్తిపై కత్తితో దాడి, పరారీలో అసద్ గ్యాంగ్
కిరాణా షాపులోకి వెళ్లి ఆస్తులను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. దాదాపు పాపుగంటపాటు అసద్ గ్యాంగ్ కత్తులతో ఆ ప్రాంతమంతా తిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. ఖయ్యుంకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే కాలపత్తర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే అసద్ గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రౌడీ షీటర్ అసద్‌పై హత్య కేసు, రెండు హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటి కేసులు ఉన్నాయి. 2015-16 మధ్య అతడిపై పీడీ యాక్టు పెట్టారు పెట్టారు. అసద్ గ్యాంగ్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ తరహా ఘటనలు నెలకు ఒకటైనా ఓల్డ్ సిటీలో జరుగుతున్నాయని చెబుతున్నారు స్థానికులు.
ALSO READ: స్కూలుకు వెళ్లాల్సిన వయసులో అనంత లోకాలకు
పాతబస్తీలో గ్యాంగ్ వార్
కిరాణా దుకాణం వద్ద యువకుడిపై కత్తితో దాడి.. పరారీ
రౌడీ షీటర్ అసద్ ముఠా కోసం గాలింపు
భయం పుట్టిస్తున్న సీసీటీవీ కెమెరా దృశ్యాలు
Gangwar in Old City Hyderabad.. A Young man attacked with knife at grocery store and absconded pic.twitter.com/UZ8iaTfkG8
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2026