E-Paper
Advertisement

ప్రభుత్వ ప్రాథమిక స్థాయిలో మందుల్లేవ్.. సర్వేలో వెలుగులోకి సంచలనాలు..?

ప్రభుత్వ ప్రాథమిక స్థాయిలో మందుల్లేవ్.. సర్వేలో వెలుగులోకి సంచలనాలు..?
Advertisement

Medicine Shortage: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలోనూ మందుల కొరత వేధిస్తున్నట్లు ఏఐవైఎఫ్​ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పరిశీలనలో గుర్తించారు. ప్రాథమిక స్థాయి ఆరోగ్య కేంద్రంలో బేసిక్ మందులు కూడా లభించడం లేదని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఏజెన్సీ జిల్లాలైన ఆదిలాబాద్, కొత్తగూడెంలలోనూ లేవని తమ రిపోర్టులో పేర్కొన్నారు. జ్వరం, బీపీ, షుగర్ వంటి మెడిసిన్స్ కూడా షార్టేజ్ లో ఉన్నట్లు పొందుపరిచారు. ఇదే అంశంపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ ను ఏఐవైఎఫ్​ ప్రతినిధులు ప్రత్యేకంగా కలిసి ఫిర్యాదు చేశారు.

తీవ్రమైన మందుల కొరత..

ఏఐవైఎఫ్​ టీమ్ పర్యటించిన ఆసుపత్రుల వివరాలు, షార్టేజ్ డ్రగ్స్ లిస్టును డీహెచ్ కు సమర్పించారు. వెంటనే తాను రిపోర్టు తెప్పించుకొని పరిశీలిస్తానని డీహెచ్ చెప్పిన్నట్లు ఏఐవైఎఫ్​ టీమ్ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్రమైన మందుల కొరత నెలకొనడం సరికాదని ఏఐవైఎఫ్​ ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర వెల్లడించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఆధారపడే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, కార్పొరేట్ ఆసుపత్రులకు లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

కీలకమైనవే..?

Advertisement

సాధారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వరం, బీపీ, షుగర్ మందులు తప్పనిసరిగా ఉండాలి. కానీ గ్రేటర్ హైదరాబాద్ తోపాటు కొత్తగూడెం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ మందులు కూడా లేవని ఏఐవైఎఫ్​ చెబుతున్నది. పారాసెట్ మాల్ , ఐ బ్రూఫిన్, ప్యాన్ టోప్రాజోల్, అమాక్సిల్లిన్ , అజిత్రోమైసిన్ వంటి మెడిసిన్స్ పీహెచ్ సీ స్థాయిలో కీలకం. కానీ ఇవి కూడా లేకపోవడం విచిత్రంగా ఉన్నదని ఏఐవైఎఫ్​ ప్రతినిధులు చెప్తున్నారు. ఇక దీర్ఘకాలికంగా బీపీ మందులైన టెల్ మిసార్టన్, అమ్లోడిపైన్, షుగర్ కు వినియోగించే మెట్ ఫామిన్, గ్లైమెపిరైడ్, హార్ట్ కు సంబంధించిన క్లోపిడోజ్రెల్ వంటి మందులు కూడా కొరత ఉన్నది. ఇక లైఫ్​ సేవింగ్ మెడిసిన్ గా పిలువబడే లాబేలలాల్, అల్ ప్రోజోలమ్, నార్ ఫ్లెక్సాసిన్, ఇన్ స్ప్రిన్ క్లోమెట్రోస్పీన్ వంటి మెడిసిన్స్ అయితే కనిపించడమే కష్టంగా ఉన్నది.

Also Read: 34 ఏళ్ల తర్వాత రీ క్రియేట్.. 62 ఏళ్లలో అదరగొట్టేసిన చిరంజీవి బ్యూటీ!

కింది స్థాయి వాస్థవాలు..

Advertisement

దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా, మందులు లేకపోవడంతో రోగులు బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది పేదలపై ఆర్థిక దాడి మాత్రమే కాకుండా, వారి ఆరోగ్య హక్కులను బహిరంగంగా తుంగలో తొక్కడమేనని ఏఐవైఎఫ్​ చెబుతున్నది. ప్రభుత్వం ఆరోగ్య రంగానికి భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ, కింది స్థాయి వాస్తవాలను పూర్తిగా విస్మరిస్తోందన్నారు.. మందుల కొనుగోలు, సరఫరా వ్యవస్థలో అవినీతి, నిర్వాకం, మధ్యవర్తుల దోపిడీ వల్ల ప్రజలకు మందులు అందడం లేదన్నారు. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదని, పేదలపై వ్యవస్థాపిత దాడి అని ఏఐవైఎఫ్​ టీమ్ సభ్యులు విమర్శించారు.

జ్యూడీషియల్ ఎంక్వైయిరీ అవసరం..

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతపై హై లెవల్ జ్యుడీషియల్ విచారణ జరపాలని,అన్ని ప్రాథమిక ,ప్రాణరక్షక మందులను తక్షణమే ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని ఏఐవైఎఫ్​ డిమాండ్ చేసింది. మందుల కొనుగోలు, సరఫరాలో జరిగిన అవినీతిపై బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేట్ ఆసుపత్రులకు లాభం చేకూర్చే విధానాలను వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి, ప్రతి పౌరుడికి ఉచిత, నాణ్యమైన వైద్యం హక్కుగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని వారు హెచ్చరించారు.

Also Read: Delimitation : గొంతెత్తిన తెలంగాణ.. సర్కారుకు జై!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×