E-Paper
Advertisement

Delimitation : గొంతెత్తిన తెలంగాణ.. సర్కారుకు జై!

Delimitation : గొంతెత్తిన తెలంగాణ.. సర్కారుకు జై!
Advertisement

నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ మరోసారి గొంతు ఎత్తేందుకు సిద్ధమవుతోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసేందుకు దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించడం లేదు. దీంతో కేంద్రంలోని మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచుతామని ప్రకటించింది. ఇలా చేయడం ద్వారానూ దక్షిణాదికి న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు డీలిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్‌కు కలిగే నష్టాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని మరో ఉద్యమం పుట్టుకొస్తుందని కేంద్రానికి అల్టిమేటం జారీచేశారు.

హైబ్రిడ్ లేదా జీఎస్‌డీపీ ప్రకారం..

డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్రం ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లును విడుదల చేసింది. నేడు పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు రానుంది.అయితే, మహిళా బిల్లుకు దేశంలోని అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. డీలిమిటేషన్ బిల్లుకు మాత్రం ఇండియా కూటమి అంగీకరించడం లేదు. దక్షిణాది రాష్ట్రాలు సైతం ఒప్పుకోవడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం హైబ్రిడ్ లేదా జీఎస్‌డీపీ ఆధారంగా పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు పెంచాలని ప్రతిపాదించారు. దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదాయం సమకూరుస్తున్నాయని.. ఈ రాష్ట్రాల్లో జీఎస్‌డీపీ ఆధారంగా సీట్లు పెంచితేనే న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకు కేంద్రం అంగీకరించకపోతే ఉద్యమిస్తానని సీఎం స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలు ఒకే తాటిపైకి రావాలని ఇతర రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖలు సైతం రాశారు.

బీఆర్ఎస్ మద్దతు..

Advertisement

కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణలోని అన్నిపార్టీలు మద్దతు పలికాయి. కానీ,రాష్ట్రానికి అన్యాయం చేసేలా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, దక్షిణాది ప్రభావాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఊరుకునేది లేదని, మరోసారి రాష్ట్రంలో ఉద్యమం పుడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ డీలిమిటేషన్ మీద ముందు నుంచి ఒకే విధానాన్ని అనుసరిస్తుందని వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరించాలని, దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సైతం డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చింది. అధికార పక్షానికి ప్రతిపక్షం సైతం మద్దతు ఇవ్వడంతో తెలంగాణం ఏకతాటి మీదకు వచ్చినట్టు అయ్యింది.

లోకేశ్ కొత్త ప్రయాణానికి పవన్ ‘ఆల్ ది బెస్ట్’.. యువ నాయకత్వంపై ఆశాభావం

Advertisement

ఇదిలాఉండగా, నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సైతం డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే తెలంగాణ ప్రజలు సహంచరని పేర్కొన్నారు.జనాభా ప్రాతిపదికన లేదా 50 శాతం సీట్లు పెంచినా ఉత్తరాదితో సమానంగా దక్షిణాదిలోనూ సీట్లు పెరగాలని ఆమె డిమాండ్ చేశారు. ఉత్తరాదిలో ఎక్కువ సీట్లు పెంచి దక్షిణాదిలో తక్కువ సీట్లు పెరిగితే పార్లమెంటులో తెలంగాణతో పాటే దక్షిణాది రాష్ట్రాలకు బలం తగ్గిపోతుందని, కేంద్రం పెత్తనం పెరుగుతుందని అన్ని రాజకీయపార్టీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు ఉపాధిని సృష్టిస్తున్నాయని, ఆదాయాన్ని పెంచుతున్నాయని.. పన్నుల రూపంలో ఇక్కడి నుంచి 40శాతం కేంద్రానికి వెళితే కేవలం రూ.2 చొప్పున తిరిగి దక్షిణాదికి వస్తున్నట్టు బడా నేతలు ఆరోపిస్తున్నారు.

Related News

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×