E-Paper
Advertisement

సింగరేణి ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. పూర్తి పే స్కేల్ పట్టిక ఇదే!

సింగరేణి ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. పూర్తి పే స్కేల్ పట్టిక ఇదే!
Advertisement

Singareni Salary: స్వేచ్చ బ్యూరో: సింగరేణి అధికారుల చిరకాల విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నెరవేరింది. కోలిండియా తరహా వేతనాలను అమలు చేస్తూ సింగరేణి యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌-1 నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌-7 వరకు ఉన్న సుమారు 1,800 మంది అధికారులకు ప్రయోజనం చేకూరనుంది. ‎సవరించిన బేసిక్ వేతనాలు 2017 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.

సెప్టెంబర్ 25 నుంచి..

అయితే, ఆర్థిక ప్రయోజనాలు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపిన గత నెల సెప్టెంబర్ 25 నుంచి వర్తించనున్నాయి. ఈ పెరిగిన వేతనాలను అక్టోబరు నెల జీతాల నుంచి చెల్లించనున్నారు. సవరించిన వేతనాల అమలుకు సంబంధించి సంస్థ డైరెక్టర్‌ గౌతమ్ పోట్రు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ‎కోలిండియాలో వేతన అసమానతల నేపథ్యంలో మహారత్న సంస్థల వేతన విధానాన్ని తమకు అమలు చేయాలని కోలిండియా అధికారులు కోరారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కోలిండియా యాజమాన్యం ఆమోదం తెలిపాయి. అదే విధానాన్ని సింగరేణిలోనూ అమలుచేయాలని సంస్థ అధికారులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ‎

వేతనాల పెంపుపై నిర్ణయం..

Advertisement

ఈ విజ్ఞప్తిపై స్పందించిన భట్టి విక్రమార్క దసరాలోపు అధికారులకు శుభవార్త అందేలా చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జులైలో సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం ఈ అంశంపై సింగరేణి యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేసి, దాని నివేదిక ఆధారంగా బోర్డు ఆమోదంతో వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, ఇచ్చిన హామీని నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సింగరేణి అధికారుల సంఘం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also read: రెండు పెన్నులతో రాస్తారా.. మేము తీసుకోం పో..?

ప్రభుత్వం తీపి కబురుగా..

Advertisement

ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ఇంధన అవసరాల కోసం మరింత అంకితభావంతో బొగ్గు ఉత్పత్తి చేసి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతామని పేర్కొన్నారు. ఇదిలాఉండగా ‎ఇటీవలే దసరా సందర్భంగా సింగరేణిలోని దాదాపు 39 వేల మంది కార్మికులకు, ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం తీపి కబురుగా రూ.596 కోట్ల రూపాయల బోనస్ అందించిన విషయం తెలిసిందే. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికుల శ్రమను గుర్తించి వారికి రూ.5,500 చొప్పున బోనస్ ను ప్రకటించారు. తాజాగా అధికారులకు వేతన సవరణపై ఉత్తర్వులు వెలువడటం విశేషం.
‎
‎కొత్త వేతనాల ప్రకారం అధికారుల బేసిక్ వేతనాలు
కేడర్ పాత బేసిక్ కొత్త బేసిక్ వేతనం
ఈ-1 రూ.40,000 రూ.60,000
ఈ-2 రూ.50,000 రూ.70,000
ఈ-3 రూ.60,000 రూ.80,000
ఈ-4 రూ.70,000 రూ.90,000
ఈ-5 రూ.80,000 రూ.1,00,000
ఈ-6 రూ.90,000 రూ.1,20,000

Tags

Related News

హైదరాబాద్‌లో కొత్త బోర్లకు నో పర్మిషన్! ఎల్‌నినోపై సీఎస్ సంజయ్ జాజు సంచలన ఆదేశాలు

గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల భారీ స్కాంమ్.. రూ.6 కోట్ల సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్!

సీఎం రేవంత్‌తో మధుయాష్కీ భేటీ.. పాలన, పార్టీ బలోపేతంపై కీలక చర్చ

కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!

నవంబర్ లోగా కాఫర్ డ్యామ్ కట్టాల్సిందే.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచుతాం: కవిత

రెండు పెన్నులతో రాస్తారా.. మేము తీసుకోం పో..?

ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ కార్డుదారులకు కొత్త సరుకులు.. మంత్రి క్లారటీ!

Big Stories

Advertisement
×