Hyderabad: హైదరాబాద్ సిటీలోని పీవీ ఎక్స్ప్రెస్వేపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 131 సమీపంలో ఆరు కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనతో ఆ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?
హైదరాబాద్ సిటీలోని ఫ్లైఓవర్ల గురించి చెప్పాల్సిన పని లేదు. టూ వీలర్ లేకుండా కార్లు మీద వెళ్లేవారు అతివేగంగా వెళ్తుంటారు. ఈ క్రమంలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ సిటీలో చోటు చేసుకుంది. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వెళ్లే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ని ఢీ కొట్టింది. దీంతో కారు రెండు మూడు పల్తీలు కొట్టింది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను తలపించాయి. ఈ సన్నివేశాన్ని చూశారు వాహనదారులు. అంతే వేగంతో వెనుక నుంచి వస్తున్న మరో ఐదు కార్లు ఒకదానికి మరొకటి ఢీ కొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వరుస ప్రమాదంలో ఆరు కార్లు దెబ్బతిన్నాయి.
ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వేగంగా అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు వరుస ఘటనతో ఫైఓవర్పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. డ్యామేజ్ అయిన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరూ గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఎలా జరిగింది అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: కరువును ఎదిరించి.. ఎండిన పొలాలను తడిపి.. చిన్నమాధారం అన్నదాతల భగీరథ ప్రయత్నం!
#HYDTPinfo
#AccidentAlert🚨
An accident has been reported near Pillar No. 131 on PVNR Expressway towards Aramghar. our mobile staff of @shotr_rjnr have reached the spot to clear the vehicles.Commuters are requested to proceed with caution and follow traffic personnel… https://t.co/OaZ8vRSVdx pic.twitter.com/GIjrF1mFdx
— Hyderabad Traffic Police (@HYDTP) October 15, 2026