Big Stories

Trolls on KTR Failures: కేటీఆర్ సీన్ రివర్స్.. ఇక చాల్లే.. తప్పుకో.. అని ట్రోలింగ్!

- Advertisement -

బిఆర్ఎస్ ఫ్యూచర్ బాస్ కేటీఆర్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్‌రావు కంటే కేటీఆర్‌కి అంత ప్రయార్టీ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ నెక్స్ట్ సీఎం అని నాడు మంత్రులుగా పని చేసిన వారు, ఎమ్మెల్యేలు సైతం బహిరంగంగా ప్రకటించారు. దానికి తగ్గట్టే శాసన సభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని తానై వ్యవహరించిన కేటీఆర్.. పూర్తిగా విఫలమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అయితే మరీ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. పదేళ్లు పవర్‌లో ఉన్న కారు పార్టీకి సగం ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. దాంతో పార్టీ భవిష్యత్తు డైలమాలో పడింది.

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలవబోతున్నామని చెప్పిన కేటీఆర్.. అన్ని నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. అయితే నాయకులను, కార్యకర్తలను సమన్వయపర్చలేకపోయారు. తెలంగాణ గళం ఢిల్లీలో వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపిలు గెలిచితీరాలని మరోసారి సెంట్ మెంట్ రగిల్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండాపోయింది.

Also Read: కదులుతున్న డొంకలు.. తెలంగాణాలో దర్యాప్తులు స్పీడప్

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండో స్థానం దక్కడమే కారు పార్టీకి దక్కిన గౌరవం ఏడు స్థానల్లో మూడో స్థానానికి పరిమితమై.. ఇంకో ఏడు చోట్లు డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది. ఇక ఎన్నికల తర్వాత ఫలితాలపై కేటీఆర్ కనీసం సమీక్ష నిర్వహించలేదు. కేసీఆర్ కూడా ఓటమిపై స్పందించకుండా ముఖం చాటేసి ఎప్పటిలా ఫాం హౌస్‌కే పరిమితమయ్యారు. దాంతో అసలే అరకొరగా మిగిలి ఉన్న గులాబీటీంని మరింత ఢీలా పడిపోయేలా చేస్తుంది.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్ ప్రమాదంలో మరణించడంతో.. కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని బీఆర్ఎస్ మళ్లీ సాయన్న చిన్న కూతురుకే టికెట్ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 7 నుండి 8 సీట్లతో పాటుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పిన కేటీఆర్.. ప్రచార సమయంలో చివరి వరకు ఆ సెగ్మెంట్‌ వైపు కన్నెత్తి చూడలేదు. ఓడిపోతామని ముందే తెలిసినట్లు నామమాత్రంగా నామమాత్రం వ్యవహరించి చేతులు దులుపుకున్నారు. అలా ఆ సిట్టింగ్ సీటు పోయింది. గ్రేటర్ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్‌ ఆ లోటు తీర్చుకుంది.

Also Read: Telangana TET 2024 Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. దీనితో ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ నుంచి పోటీకి చాలామంది పోటీ పడ్డారు. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సన్నిహితుడైన రాకేష్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోగలిగారు. దానిపై వరంగల్ జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా సరే రాకేష్ రెడ్డికే టికెట్ కేటాయించారు. వరుస సమీక్షలతో అన్ని తానై ప్రచారం నిర్వహించిన కేటీఆర్.. పట్టభద్రులను మాత్రం ఆకట్టుకోలేక పోయారు. అలా సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు కూడా కారులో నుంచి మాయమైంది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే బిక్కచచ్చిపోయింది బీఆర్ఎస్ .. ఆ తర్వాత కేసీఆర్ జారిపడి సర్జరీ చేయించుకోవడంతో.. పార్టీ పగ్గాలు అనధికారికంగా కేటీఆర్ చేతిలోకి వచ్చాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొదటి పరీక్షలోనే సున్నా మార్కులు పడ్డాయి చిన్న బాస్‌కి.. వరుస ఓటములకు కేటీఆర్ బాధ్యత వహించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులో ఇక చాల్లే.. తప్పుకోమంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టాయి గులాబీ శ్రేణులు.. పార్టీ పగ్గాలు హరీష్ రావుకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి. చూడాలి మరి ఓటమికి తానే బాధ్యుడ్నని కేటీఆర్ ఒప్పుకుంటారో? లేకపోతే తూచ్ నాకు సంబంధం లేదంటారో..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News