IPS Puran Kumar: ఇటీవల చండీగఢ్ లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన డిప్యూటీ సీఎం ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్, వారి కుటుంబ సభ్యులతో కూడా డిప్యూటీ సీఎం, సీఎం రేవంత్ రెడ్డిలు ఫోన్ లో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు, పూరన్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్ ను పరామర్శించడానికి వచ్చిన హర్యానా చీఫ్ సెక్రటరీ అనురాగ్ రస్తోగి తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి సూసైడ్ నోట్ ఆధారంగా ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించి పూరన్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పూరన్ కుమార్ అత్యంత ప్రతిభావంతుడని అన్నారు.. ప్రసిద్ధి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చదివాడని.. అనంతరం ఐఐఎం అహ్మదాబాదులో చదివిన గొప్ప మేధావి అని చెప్పారు. ఉన్నతాధికారుల కుల వివక్ష, వేధింపులు భరించ లేక ఆత్మహత్య చేసుకోవడం.. చాలా తీవ్రమైన అంశమని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
‘పూరన్ కుమార్ సూసైడ్ నోట్ డైయింగ్ డిక్లరేషన్ గా భావించాలి. ఘటన జరిగి ఇన్ని రోజులు అయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వృద్ద తల్లిదండ్రులను, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న పూరన్ కుమార్ కుటుంబానికి రక్షణ కల్పించి ఆదుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని, చండీఘర్ పోలీసులను డిమాండ్ చేసారు..కపూర్ అనే అధికారి దళిత వ్యతిరేకి అని తెలిసి కూడా బీజేపీ ప్రభుత్వం అతన్ని డీజీపీనీ చేసింది ఈ ప్రభుత్వం ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో డెత్ బెడ్ మీద ఉండి కూడా న్యాయం కోసం ప్రాధేయపడడం దురదృష్టం’ అని అన్నారు.
ALSO READ: SSC Police: ఇంటర్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. భారీ వేతనం, అప్లికేషన్‌కు ఇంకా 2 రోజులే
అత్యంత పిన్న వయసులోనే ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత పూరన్ కుమార్. అతని చివరి డెత్ లెటర్ ఆధారంగా సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాలి. హర్యానా, చండీగఢ్ ప్రభుత్వాలు బీజేపీ పాలనలో ఉన్నాయి. సీఎం రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. మేం చట్టాన్ని ధిక్కరించే పని అడగడం లేదు.. బాధ్యత గల ప్రభుత్వాలు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి అని అడుగుతున్నాం. మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు’ అని అన్నారు.
ALSO READ: Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. భర్తను తలచుకుని స్టేజ్ పైనే ఏడ్చేసిన మాగంటి సునీత
పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు, ఝార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కొప్పుల రాజు, చండీఘర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హర్మోహిందర్ సింగ్ లకి, మీడియా అడ్వైజర్ భూపేంద్ర సింగ్ బూర, జస్ప్రీత్ సింగ్, ఏఐసీసీ సెక్రటరీ పర్దీప్ నర్వాల్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దీపక్ లుభానా, ధర్మేంద్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు, రాజ్ దీప్ సిద్ధు లు పాల్గొన్నారు.