BigTV English

Bigg Boss 9 : ఫైర్ స్ట్రోమ్ వచ్చింది, హౌస్ లో చిచ్చు పెట్టింది. కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా?

Bigg Boss 9 : ఫైర్ స్ట్రోమ్ వచ్చింది, హౌస్ లో చిచ్చు పెట్టింది. కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా?

Bigg Boss 9 : బిగ్బాస్ సీజన్ 9 ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీస్ తర్వాత 36వ రోజు మొదలైంది. అవుట్ హౌస్ లో ఉన్న లగేజ్ మొత్తం తీసుకొని మెయిన్ హౌస్ లోకి వెళ్లిపోమన్నారు. అవుట్ హౌస్ క్లోజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.


దివ్య భరణి దగ్గర బాధపడింది. నన్ను చాలామంది ఫేక్ అంటున్నారు. ఒకరితోనే ఉంటున్నావు అని అడిగారు. నేను ఒక మనిషిని బయట చూసి వచ్చి వాడుకుంటున్నాను అనే స్టేట్మెంట్ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది దివ్య. నేను మిమ్మల్ని నిజంగానే అన్నయ్య అని ఫీల్ అవుతుంటే గేమ్ కోసం చేస్తున్నాను అని జనాలు అంటుంటే నాకు ఏడుపొస్తుంది అని ఏడ్చేసింది.

ఇమ్మానుయేల్ ఆయేషా మేకప్ వేసుకునే తరుణంలో, మేకప్ లేకుండానే నువ్వు బాగున్నావ్ అని తనుజాకు వినిపించేటట్లు అన్నాడు. తర్వాత తనుజ వచ్చి ఇమ్మానియేల్ ను అడిగింది. మరోవైపు రీతు బట్టలుతుకుతుంటే ఇమ్మానుయేల్ ట్రోల్ చేశాడు. మంచిగా ఎంటర్టైన్ చేశాడు.


పవన్, కళ్యాణ్, దివ్య కలిసి మాధురి స్నానం చేసి వచ్చి వండుతాను అంటే మనం ఎప్పుడు తింటాం రా అనే డిస్కషన్ పెట్టుకున్నారు. రమ్య మోక్ష సంజనా తో మాట్లాడుతూ ఒకవైపు అంత పెద్ద డిస్కషన్ జరుగుతుంటే మీరు చెప్పాల్సిన చిన్న మాట చెప్పేసి వెళ్లిపోయారు. అంత డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు అని అర్థమైంది మీకు కూడా అని చెప్పింది. మళ్లీ ఎందుకు ఏడుస్తుంది ఊరికే అని మిమ్మల్ని చూస్తే అనిపించింది అని సంజన గారితో చెప్పింది.

దువ్వాడ మాధురి ఫైర్

వాళ్లు అనుకున్నట్లుగానే దువ్వాడ మాధురిని డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలిచారు. రాగానే కూర్చోమని కళ్యాణ్ చెప్పాడు. పర్లేదు నేను అక్కడికి వెళ్లాలి చెప్పండి నిలుచుంటే చెప్పరా అని అడిగింది. మీరు ఇలా చేస్తుంటే బ్రేక్ ఫాస్ట్ లేట్ అవుతుంది అని చెప్పగానే, నేను అరగంట కూర్చున్నాను అప్పుడు మీరు ఏం చేశారు అని డైరెక్ట్ ఆర్గ్యుమెంట్ లో దిగిపోయింది. వెంటనే కెప్టెన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పాడు. వెంటనే మాట్లాడండి అని మాధురి చెప్పింది.

వేరేలా మాట్లాడాల్సి వస్తది అని కళ్యాణ్ అన్నాడు కదా, అంటే ఎలా మాట్లాడుతాడు అని తనుజాతో కిచెన్ లో డిస్కషన్ పెట్టింది మాధురి. కూల్ గా మాట్లాడుకుంటే అయిపోద్ది అని పవన్ క్లారిటీ ఇచ్చాడు. మళ్లీ దీని గురించి కిచెన్ లో దువ్వాడ మాధురి మరియు కళ్యాణ్ మధ్య విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. మొత్తానికి హార్ట్ అయినందుకు కళ్యాణ్ సారీ చెప్పాడు.

ఇదే టాపిక్ గురించి మళ్లీ భరణి, కళ్యాణ్, దివ్య వీళ్ళందరూ కూడా టాపిక్ పెట్టారు. కెప్టెన్ గా ఆన్ టైంలో ఫుడ్ కావాలి అని మీరు నిర్మొహమాటంగా చెప్పేయండి అని భరణి కళ్యాణ్ తో చెప్పాడు.

అమ్మాయిల పిచ్చోడు 

శ్రీజ కి సంబంధించిన ఎలిమినేషన్ బెలూన్ కట్ చేసినందుకు కళ్యాణ్ సరిగా మాట్లాడటం లేదు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడం లేదు అని మోక్ష రమ్య దువ్వాడ మాధురి తో చెప్పింది. మాట్లాడకపోతే ఎవరికి నష్టం మనం గేమ్ ఆడటానికి వచ్చాం. తనకి అమ్మాయిలు పిచ్చి. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చేతులు ఇలా వేసి మాట్లాడాడు ఇరిటేటింగ్ అనిపించింది. మరోవైపు తనుజ కూడా లీనియన్స్ ఇస్తుంది.

దువ్వాడ వెటకారం

దివ్య మాట్లాడుతూ రెండు కప్పుల పప్పు పెట్టాను ఇది రెండు పూటలకి రావాలి అని చెప్పింది. ఆ రావాలి అంటే బకెట్ వాటర్ ఇయ్యాలి అని దువ్వాడ మాధురి అంది. మీరేం చేస్తారో మీ ఇష్టం అనుకొని దివ్య వెళ్ళిపోయింది. ఇదే విషయాన్ని కళ్యాణ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నిఖిల్ ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసి దీనిని వెటకారం అని అంటారు కదా అని అడిగాడు. నిఖిల్ కూడా దానినే ఒప్పుకున్నాడు.

బాటిల్ గొడవ 

కిచెన్ లో గ్రాసరీస్ అయిపోయే టైంకి వచ్చాయి. గౌరవ్ గుప్తా, ఆయేషా మధ్య నాకు బాటిల్ గురించి ఫన్నీ డిస్కషన్ జరిగింది. డిష్ వాషింగ్ గురించి రీతు మరియు ఆయేషా మధ్య డిస్కషన్ జరిగింది. మళ్లీ కిచెన్ లో పవన్ రీతు మధ్య డిష్ వాషింగ్ గురించి డిస్కషన్ జరిగింది. ఇద్దరినీ డిస్కషన్ ఆపేయమని దువ్వాడ మాధురి వచ్చి చెప్పారు.

మనలో యూనిటీ ఉండాలి

నిఖిల్ మాట్లాడుతూ ఇక్కడ నాకు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ కాదు అని మోక్ష రమ్యతో చెప్పాడు. రమ్య సూపర్ అని ఆ మాటను అప్రిషియేట్ చేసింది. దువ్వాడ మాధురి వచ్చి మనిద్దరికీ ఒక రకమైన బాండింగ్ స్టార్ట్ అయింది అంటే ఫైనల్ లో నువ్వు నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తావ్ అని ఆ డిస్కషన్ లో కూర్చుని అడిగింది. వైల్డ్ కార్డు ద్వారా ఎవరైతే వచ్చామో ఈ టైంలో మనకి ప్రజెంట్ యూనిటీ ఉండాలి అని రమ్య మోక్ష దువ్వాడ మాధురి తో చెప్పింది.

మనం హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దివ్య అసలు మాట్లాడటానికి రాలేదు. సంజన మైండ్ గేమ్ ఆడుతుంది. భరణి గారితో తప్ప ఇంకెవరితో మాట్లాడినట్టు నేను చూడలేదు అని రమ్య మోక్ష కన్ఫర్మ్ చేసింది. ఫేక్ అనే టాక్ తనకు ఇచ్చాను నేను రమ్య మోక్ష చెప్పింది.

నామినేషన్ ప్రక్రియ 

ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్ ను వైల్డ్ కార్డు ఎంట్రీ వాళ్ళకు ఎలిమినేట్ చేసే అవకాశం ఇచ్చారు. దానికోసం ఒక టాస్క్ పెట్టారు. కెప్టెన్ కళ్యాణ్ మరియు వైల్డ్ కార్డు వాళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు. అయితే బెల్ మోగినప్పుడు ఒక బాల్ వస్తుంది. ఆ బాల్ ను వైల్డ్ కార్డు ఎంట్రీ వాళ్ళు ఎవరు పట్టుకుంటే, వారు ఆ బాల్ ను హౌస్ మేట్స్ కి ఇవ్వాలి.

ఎవరైతే హౌస్ మేట్ బాల్ పొందుకున్నారు వాళ్లు హౌస్ లో ఉన్న ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆ ఇద్దరూ తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి తమ పాయింట్ చెప్పాలి. ఆ పాయింట్ బట్టి ఒకరిని సేవ్ చేసి ఇంకొకరిని నామినేట్ చేసే ఆప్షన్ వైల్డ్ కార్డు ఎంట్రీ వాళ్ళకి ఉంటుంది.

తనుజ కు బాల్ అందించారు. రాము రాథోడ్ ను తనుజ నామినేట్ చేశారు. కెప్టెన్ గా సరిగ్గా వ్యవహరించలేదు అనే కారణం చెప్పారు. అలానే రెండో నామినేషన్ కాండేట్ గా సుమన్ శెట్టిని ఎంచుకున్నారు. సుమన్ శెట్టి అందరితో వచ్చి కలవట్లేదు అని రీజన్ చెప్పారు.

ఇన్నోసెంట్ పీపుల్ ని నామినేట్ చేసావ్ 

దువ్వాడ మాధురి తనుజ తో మాట్లాడుతూ నువ్వు ఇద్దరు ఇన్నోసెంట్ పీపుల్ ని నామినేట్ చేసేసావు. మనము ఎప్పుడైనా స్ట్రాంగ్ పీపుల్ ని నామినేట్ చేయాలి. దీనిని నువ్వు గుర్తు పెట్టుకో. నువ్వు ఒక స్ట్రాంగ్ పర్సన్ ను నామినేట్ చేస్తే నువ్వు విన్ అవుతావ్. వీక్ పర్సన్ ని పట్టుకొని నామినేట్ చేస్తావ్ ఏంటి అని అడిగింది. తను కెప్టెన్ గా సరిగ్గా బిహేవ్ చేయలేదు అని శ్రీనివాస్ సాయితో తనుజ చెప్పింది.

సుమన్ శెట్టి తో మంతనాలు 

దువ్వాడ మాధురి సుమన్ శెట్టిని పక్కకు తీసుకెళ్లి మీకు ఒకవేళ బాల్ ఇస్తే ఎవరిని నామినేట్ చేస్తారు.? అని అడిగింది. ఖచ్చితంగా తనుజను చేస్తారు కదా అని తనే చెప్పింది. ఆయేషా మాట్లాడుతూ తనూజ ఊరికే బాధపడుద్ది, లేదంటే ఏడుస్తుంది. అందుకే ఆమె ఎమోషనల్ గా అందరి సపోర్ట్ పొందుకుంటుంది.

మరోవైపు పవన్ తో మంతనాలు జరిపితే నేను భరణిను నామినేట్ చేస్తాను. అలానే రాము నీ నామినేట్ చేస్తాను. అని పవన్ దువ్వాడ మాధురి తో చెప్పాడు. రమ్య మోక్ష బాల్ గెలుచుకొని రాము రాథోడ్ చేతికి ఇచ్చింది.

రాము రాథోడ్ ఆర్గ్యుమెంట్ 

బెలూన్ టాస్క్ లో పౌల్ గేమ్ రీతు చౌదరి, పవన్ ఆడారు కాబట్టి వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. వాళ్ళిద్దరికీ మధ్య విపరీతమైన హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. మరోవైపు పవన్ కూడా ఆర్గ్యుమెంట్ చేయడం మొదలుపెట్టాడు. రమ్య మోక్ష రీతుని సేవ్ చేసింది. పవన్ ను నామినేషన్ లో పెట్టింది.

Also Read: Bigg Boss 9 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో వచ్చిన వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? గమనించారా?

Related News

Bigg Boss 9 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో వచ్చిన వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? గమనించారా?

Bigg Boss 9 promo: ఫైవ్ మినిట్స్ చాట్ పాప ఫ్లాట్ , ఇమ్ము కొత్త లవ్ ట్రాక్ ఈసారి చెన్నై పాపతో

Ramya Moksha: పచ్చళ్ళ పాప ఆమెపై పగబట్టేసింది, వామ్మో ఒక్క రోజులో ఇన్ని స్ట్రాటజీలా?

Divvala – Duvvada: పెళ్లి కాకుండానే దివ్వల.. ‘దువ్వాడ’ మాధురి ఎలా అయ్యింది? బిగ్ బాస్‌లో ఇది గమనించారా?

Duvvada Madhuri : పడుకుంటున్న సీజన్ లేపడానికి వచ్చిన దేవత, ఎవరిని విడిచిపెట్టని దువ్వాడ మాధురి

Bigg Boss 9 Promo: మొదలైన నామినేషన్స్ రచ్చ.. ఎలిమినేషన్ వారి చేతుల్లోనే!

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ హౌస్‌కు నిప్పు పెట్టిన దివ్వెల.. రచ్చ చేసి.. ఏడ్చేసి.. వామ్మో మహానటి!

Big Stories

×