Big Stories

Kaleshwaram, Power Sector and Sheep Scam: కదులుతున్న డొంకలు.. తెలంగాణాలో దర్యాప్తులు స్పీడప్

Judicial Commission investigation on BRS Scams: తెలంగాణలో ఏం నడుస్తుంది..? నోటీసులు.. విచారణలు.. ఆరోపణలు, అనుమానాలపై దర్యాప్తులు. మేడిగడ్డ నుంచి మొదలు పెడితే.. అన్ని శాఖల్లో జరిగిన అవకతవకలపై విచారణలను నడుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఇదే నడుస్తోంది. ఇన్నాళ్లు అదిగో.. ఇదిగో అన్న ప్రచారాలు ఇప్పుడు నిజాలవుతున్నాయి. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలన. అభివృద్ధి మాట ఏమో కానీ.. అరాచకాలు, అక్రమాలు, అవినీతికి కేరాఫ్‌గా నిలిచాయి. ఇది మేం అంటున్న మాట కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు.. చెబుతున్న మాటలు.. తాము కేవలం మాటలు మాత్రమే చెప్పం. అన్నింటిని వెలికితీస్తాం.. బీఆర్ఎస్‌ నేతల బాగోతాలను బయటపెడతాం అంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే చెప్పారు. చెప్పినట్టుగానే విచారణ కమిషన్‌లకు ఆదేశించారు. ఇప్పుడు ఆ విచారణలు మొదలయ్యాయి. ఒక్కొక్క అంశంపై విచారణ ఎలా జరుగుతోంది? ఇప్పటి వరకు జరిగిన అప్‌డేట్స్ ఏంటో చూద్దాం.

- Advertisement -

ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి వద్దాం.. ఈ ప్రాజెక్ట్‌లోని మూడు కీలక బ్యారేజ్‌లు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాయి. మేడిగడ్డ కుంగిపోయింది. ప్రస్తుతం అక్కడ రిపేర్లు కూడా కొనసాగుతున్నాయి. బట్ అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అనే దానిపై జస్టిస్ పీసీ ఘోష్‌ హెడ్‌గా ఓ కమిషన్‌ విచారణ జరుపుతోంది. అయితే ఈ కమిషన్‌ డెడ్‌లైన్‌ ఈ నెల 30తో ముగుస్తుంది. మరి విచారణ పూర్తైందా? దీనికి ఆన్సర్ నో అనే చెప్పాలి. నెల రోజులైంది ఈ కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ టైమ్‌లో ప్రాజెక్ట్‌ను విజిట్ చేసింది కమిషన్.. ఇప్పటి వరకు 54 ఫిర్యాదులు అందాయి. అందులో నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అధికారులను విచారిస్తున్నారు. సో విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని చెప్పాలి. అంటే డెడ్‌లైన్‌ లోపు విచారణ పూర్తి కాదు. ఇదే విషయాన్ని చంద్రఘోష్‌ కూడా చెబుతున్నారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేమంటున్నారు ఆయన.. అంటే కమిషన్‌ డెడ్‌లైన్ ఎక్స్‌డెంట్‌ అవ్వడం కన్ఫామ్‌ అనే చెప్పాలి.

- Advertisement -

బట్ జస్టిస్ పీసీ ఘోష్‌ బ్యారేజీల పరిశీలిస్తూనే.. బాధ్యులపై ఫోకస్ చేస్తున్నారు. ప్లానింగ్, డిజైన్స్, కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు.. టెయిల్‌ వాటర్, షూటింగ్ వెలాసిటీపై ఆరా తీస్తుంది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్స్‌తో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటుంది. అటు నిర్మాణ సంస్థల ప్రతినిధులపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కమిషన్.. అసలు బుంగలు ఎలా పడ్డాయి? ఎందుకు పడ్డాయి? ఎవరి నిర్లక్ష్యం దీనికి కారణం? ఇలా ప్రతి ఒక్క విషయంపై ఫోకస్ చేస్తుంది కమిషన్.. ప్రస్తుతం అధికారులు, నిర్మాణసంస్థల వరకు వెళ్లింది కమిషన్. మరి ముందు ముందు ఎవరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి.

Also Read: టీటీడీపీ వైపు మల్లారెడ్డి చూపు? ఎందుకంటే..

నెక్ట్స్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, వాటి కోసం చేసిన అప్పులు.. దీనిపై కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌ కూడా విచారణ జరుపుతోంది. ఈ కమిషన్ కూడా దర్యాప్తును స్పీడప్ చేసింది. ప్రస్తుత, మాజీ అధికారులను విచారిస్తూనే ఉంది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం..చత్తీస్‌గడ్‌ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కమిషన్ మెయిన్‌గా ఫోకస్ చేసింది. ఇంధనశాఖ మాజీ కార్యదర్శి అర్వింద్ కుమార్.. మాజీ ట్రాన్స్‌-జెన్కో సీఎండీ ప్రభాకర్‌ రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం తాజా, మాజీ ఉన్నతాధికారులకు మాత్రమే నోటీసులు జారీ అయ్యాయి ఇక ముందు ముందు మరింత మందికి ఈ నోటీసులు, విచారణలు విస్తరించనున్నాయి.

ఇక గొర్రెల స్కామ్ అప్‌డేట్ ఏంటో తెలుసా? ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన మాజీ పశుసంవర్థక శాఖ ఎండీ రాంచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ OSD కల్యాణ్‌ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వారిని కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది నాంపల్లి కోర్టు.. మీకు తెలుసుగా.. గొర్రెల పంపిణీలో ఏకంగా 700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ చెబుతోంది. గొల్ల కురుమలకు బదులుగా.. ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్స్‌లోకి నిధులు మళ్లించి డబ్బును దోచేశారు. ఇప్పటి వరకు మొత్తం 10 మంది నేతలను గుర్తించగా.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఏసీబీ విచారణతో మరికొంత మంది పెద్దల పేర్లు బయటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కస్టడీలో ఉన్న వారిలో ఒకరు మాజీ మంత్రి OSD కాబట్టి.. ఆయన మెడకు ఈ కేసు చుట్టుకుంటుందా? అనే అనుమానాలు కనిపిస్తున్నాయి.

Also Read: Telangana TET 2024 Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

స్కామ్‌ అయినా.. అవినీతి ఆరోపణలు అయినా.. అన్నింటి రూట్స్‌ కూడా బీఆర్ఎస్‌ పాలనలోనే ఉన్నాయి. అరెస్ట్‌ అయినవారు.. విచారణతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కూడా అప్పటి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్‌ పెద్దలు, నేతలే ఉన్నారు. మొత్తంగా చూస్తే విచారణ మాత్రం చాలా వేగంగా జరుగుతుంది. మరి ఇవి ఓ ముగింపు దశకు వచ్చే సరికి మరేంత మంది జాతకాలు మారతాయనేది చూడాలి. ఇప్పటికే డొంక కదలడమైతే ప్రారంభమైంది.. ఇదైతే కన్ఫామ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News