Maganti Sunitha: జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమదంటే తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. దాదాపు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత ఈ ఉప ఎన్నికలు రావడంతో కచ్చితంగా విజయం సాధించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
భావోద్వేగానికి లోనైన మాగంటి సునీత
ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పార్టీ కార్యకర్తలతో, పార్టీ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. ఈ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తన భర్త, దివంగత నేత జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను తలచుకుని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
భర్తను తలచుకుని కన్నీరు
మాగంటి సునీత మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీటికి ఆపుకోలేకపోయారు. తన భర్తను గుర్తుకు తెచ్చుకుని బోరున విలపించారు. తన భర్త గోపీనాథ్ నియోజకవర్గానికి చేసిన సేవలను, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె స్టేజీ పైనే కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. వేదికపైనే ఆమె కంటతడి పెట్టడంతో.. సమావేశానికి హాజరైన కార్యకర్తలు, నాయకులు కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యారు.
సెంటిమెంట్‌గా మారిన ఉప ఎన్నిక
మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతోనే జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన సేవలను, ప్రజల్లో ఉన్న సానుభూతిని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాగంటి గోపీనాత్ భార్య అయిన సునీత గోపీనాథ్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఉప ఎన్నిక ఇప్పుడు కేవలం రాజకీయ పోరాటంగానే కాక, దివంగత నేత పట్ల ప్రజల్లో ఉన్న గౌరవానికి, కుటుంబంపై చూపించే సానుభూతికి సంబంధించిన సెంటిమెంట్ అంశంగా మారింది.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి కంటతడి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కార్యకర్తల సమావేశంలో కంటతడి
భర్త గోపీనాథ్‌ను తలుచుకుని కన్నీరుమున్నీరైన మాగంటి సునీత pic.twitter.com/rl3NnWdKGO
— BIG TV Breaking News (@bigtvtelugu) October 13, 2025
మాగంటి సునీత తన భర్త ఆశయాలను, ఆయన నియోజకవర్గానికి చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తానని వ్యాఖ్యానించారు. అందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజల మద్దతు తనకు కావాలని కోరారు. ఆమె భావోద్వేగంగా మాట్లాడిన తీరు కార్యకర్తలు పెద్ద ఎత్తున జోహార్ గోపన్న అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ALSO READ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేదెవరు.. నవీన్ యాదవ్ గెలుపు శాతం ఎంత..?