E-Paper
Advertisement

Jangaon District: మద్యంప్రియుల వింత డిమాండ్.. వైన్ షాప్‌ను గ్రామంలోకి తరలించాలని డిమాండ్

Jangaon District: మద్యంప్రియుల వింత డిమాండ్.. వైన్ షాప్‌ను గ్రామంలోకి తరలించాలని డిమాండ్
Advertisement

Jangaon District: జనగామ జిల్లా జఫర్‌ఘడ్‌ మండలంలో మద్యం ప్రియులు వినూత్న నిరసనకు దిగారు. పలు డిమాండ్లతో కూడిన ఫ్లెక్సీని పట్టుకుని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గ్రామ శివారులో ఉన్న వైన్‌ షాప్‌ను గ్రామం లోపలికి తరలించాలి అని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు.

మద్యం ప్రియులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ పలు కారణాలను వివరించారు. ఊరి చివరన మద్యం దుకాణం ఉండడం వల్ల అక్కడికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ దూరం కారణంగా వృద్ధులు సైతం షాపులకు చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు.

Advertisement

అంతేకాక, గ్రామం వెలుపల మద్యం షాపు ఉండడంతో గ్రామం లోపల ఉన్న చిరువ్యాపారులు నష్టపోతున్నారని మద్యం ప్రియులు ఆరోపించారు. మద్యం దుకాణం గ్రామంలో ఉంటే చిన్న చిన్న టీ స్టాళ్లు, ఇతర దుకాణాలకు కూడా వ్యాపారం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే… ఊరి బయట ఉన్న మద్యం దుకాణానికి వెళ్లే క్రమంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా వైన్‌ షాప్‌ను గ్రామం మధ్యలోకి తరలించాలని.. అప్పుడే తమ ఇబ్బందులు తొలగుతాయని వారు గట్టిగా డిమాండ్‌ చేశారు. వారి వింత డిమాండ్‌ స్థానికంగా చర్చనీయాంశమైంది.

Advertisement

ALSO READ: MLA Adi Srinivas: వేములవాడలో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లోర్ కూలిపోవడంపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×