E-Paper
Advertisement

Stray Dog Attack: 19 నెలల పసికందు పై.. వీది కుక్కలు దాడి కలకలం

Stray Dog Attack: 19 నెలల పసికందు పై.. వీది కుక్కలు దాడి కలకలం
Advertisement

Stray Dog Attack: 19 నెలల బాలికపై కుక్కలు దాడి చేసి గాయపరచిన ఘటన కండ్లకోయలో చోటు చేసుకుంది. కుక్కల దాడిలో బాలిక తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కండ్లకోయ గ్రామంలోని వేణు సుప్రజ కూతురు దాక్షిని(Dhakshini) అనే 19 నెలల బాలిక ఆదివారం రాత్రి ఆరు బయట ఆడుకుంటుండగా కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చుట్టుపక్కల వాళ్ళు చూసి కుక్కను తరిమి వేసి బాలికను కాపాడారు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. పాపను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

వరుస సంఘటనలు జరిగిన పట్టించుకోరా

గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలో కుక్కల దాడుల సంఘటనలు వరుసగా జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సైతం ఇంటిముందు ఆడుకుంటున్న బాబు పై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. సైకిల్ పై వెళుతున్న ఓ వృద్ధుడిపై కుక్కలు వెంటాడి మరి వృద్ధుడిని గాయపరిచాయి. ఇలాంటి ఘటనలో వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కండ్లకోయాలో 19 నెలల బాలిక ఆడుకుంటుండగా కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

Advertisement

Als Read: Romantic Series OTT : శేటు బిడ్డతో యవ్వారం… చిన్న పిల్లలు చూడకూడని సిరీస్… కుర్రాళ్లకు మాత్రం కిక్కు పక్కా

కుక్కలు బాబోయ్ కుక్కలు

మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలో వీధికి పది కుక్కలు ఉన్నాయి. రోడ్డుపై బైఠాయించి వచ్చిపోయే ప్రయాణికులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రజలు రోడ్డు పైకి రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను బయటకు పంపాలంటే స్థానికులు భయపడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం వేళలో వాకింగ్ చేసే వారి విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వాకింగ్ చేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. రోడ్డుపై బైఠాయించి వాకింగ్ వచ్చే వారిపైకి వెలుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించి కుక్కల నుండి కాపాడాలి అంటూ స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Advertisement

Also Read: Illu Illalu Pillalu Today Episode: విశ్వం పై అమూల్య రివేంజ్.. వల్లికి, విశ్వంకు మైండ్ బ్లాక్.. సాగర్ దొరికిపోతాడా..?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×