E-Paper
Advertisement

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!
Advertisement

ఉపాధి హామీ కూలీ పనులను.. ఊర్లలో ‘కరువు పనులు’ అని పిలుచుకుంటారు. దీని అర్థం .. ఏమీ పని దొరకనప్పుడు ప్రభుత్వమే వారికి కూలీని కల్పించే ప్రోగ్రాం అన్నమాట. ‘ఖాళీ ఉండి ఏం చేస్తాం.. కరువు పని కన్నా పోదాం.. రోజుకు ఓ మూడొందలు వస్తయి.. ఇంట్ల ఖర్చులకు పనికి వస్తాయి..’ అని అమ్మలక్కలు మాట్లాడుకుని ఉదయమే పనులకు పోతారు. మధ్యాహ్నం లోగా తిరిగి  ఇంటికి వచ్చేస్తారు.

వ్యవసాయ పనులు నడిచే సమయంలో అటువైపే పోతారు. గుత్తలు పట్టుకుని నాట్లేస్తారు. కొంత సంపాదించుకునే అవకాశం.. కూలీ చేసినా గిట్టుబాటు అవుతుంది కాబట్టి ఎవుసం పనులకే ఫస్ట్‌ ప్రయార్టీ ఉంటుంది. మరి అవి లేనప్పుడు.. ఇగో ఇవే కరువు పనులే… అదే ఉపాధి హామీ కూలీ పనులే ఊతంగా నిలుస్తున్నాయి.

Advertisement

వ్యవసాయ పనులు లేనప్పుడు మధ్యలో దొరికే ఖాళీ సమయాల్లో ఈ పనులకు పోతుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈ నెలలో కూలీల హాజరు గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఇదే నెల కేవలం 25వేల మందే పనులకు హాజరు కాగా.. ఈసారి ఇది 2.54 లక్షల మందికి చేరింది. గత నాలుగైదు ఏండ్లుగా చూసుకున్నా.. ఇంతగా ఎప్పడూ లేదు.

2021 అక్టోబర్‌ నెలలో 1.28 లక్షల మంది ఉపాధి పనులకు హాజరు కాగా, 2022లో 80,000 మంది, 2023లో 1.23 లక్షల మంది, 2024లో 32,000 మంది, 2025 అక్టోబర్‌ నెలలో 24,750 మంది అత్యల్పంగా ఉపాధి పనులకు హాజరయ్యారు. కానీ ఈసారి మాత్రం భారీగా కూలీల హాజరు పెరగడం కరువు తీవ్రతను తెలియజేస్తోంది.

Advertisement

వ్యవసాయ పనులు గణనీయంగా మందగించాయి. విస్తీర్ణమూ తగ్గింది. వాస్తవానికి వరుసగా ఈ రెండు, మూడు నెలలు వ్యవసాయ పనులు చాలా ఎక్కువగా ఉంటాయి. కూలీ పనుల్లో జనం కూడా బిజీ  బిజీగా ఉంటారు. కూలీల కొరత కూడా ఉంటుంది. కానీ ఆ కూలీలు ఇప్పుడు కరువు పనులు వెత్తుకుంటూ వెళ్లేలా చేసింది ఈ ఎల్‌నినో కరువు.

మరింత మందికి కూలీ పనులు కల్పించేందుకు కూడా రెడీగా ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎంతమందికైనా కూలీ పనులు కల్పించవచ్చు. కూలీ ఎవరికి కావాలని అడిగినా.. పదిహేను రోజుల్లోనే వారికి జాబ్‌కార్డును ఇవ్వాలి. లేదంటే నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కేసీఆర్‌ పాలనలో ఈ ఉపాధి హామీ నిధులను ఇతర పనులకు ఉపయోగించడంతో కేంద్రం.. ఈ నిధులను హోల్డ్‌లో పెట్టింది. దీంతో చాలా మంది కూలీలకు బిల్లులు రాలేదు. వీరికి కూలీ పనులు చేసినా కైకిలు కట్టియ్యలేని పరిస్థితిని తెచ్చిపెట్టింది కేసీఆర్ సర్కార్‌.

ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు రాకుండా రేవంత్‌ సర్కార్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నది. సంబంధిత శాఖ మంత్రి సీతక్క.. పలు దఫాలుగా ఈ కార్యక్రమంపై సమీక్షలు పెట్టడం, బిల్లుల మంజూరులో ఉన్న టెక్నికల్‌ ఇబ్బందులను తొలగించడంతో సకాలంలో వారికి కూలీ డబ్బులు దొరుకుతున్నాయి. దీంతో కరువు వాతావరణంలో ఈ కరువు పనులకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు గ్రామీణ ప్రజలు.

Tags

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×