E-Paper
Advertisement

TDR Policy: రియల్ ఎస్టేట్ షేక్.. బిల్డర్లకు సర్కార్ ఇచ్చిన ‘జాక్‌పాట్’ ఆఫర్ ఇదే!

TDR Policy: రియల్ ఎస్టేట్ షేక్.. బిల్డర్లకు సర్కార్ ఇచ్చిన ‘జాక్‌పాట్’ ఆఫర్ ఇదే!

TDR Policy: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో రోడ్డు విస్తరణ, నాలాల విస్తరణతో పాటు వివిధ రకాల అభివృద్ది పనులతో పాటు కొత్త ప్రాజెక్టులకు స్థలాలను సేకరించే ప్రక్రియ మరింత ఈజీగా మారనుంది. సేకరించిన స్థలాలకు సంబంధించి యజమానులకు చెల్లించే నష్టపరిహారం స్థానంలో జారీ చేసే ట్రాన్స్ ఫరబుల్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్)ల జారీకి ఇప్పటి వరకున్న నిబంధనలను ప్రభుత్వం సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హై-రైజ్ భవనాల ఎత్తు పెంపు

ముఖ్యంగా భవనాల ఎత్తు, సెట్ బ్యాక్ లు, అదనపు అంతస్తుల విషయంలో డెవలపర్లు, బిల్డర్లకు మరింత వెసులుబాటు కల్పించేలా ఈ సవరణలను చేయటంతో నిర్మాణ రంగం ఊపందుకునే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకున్న నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణ, నాలా విస్తరణతో పాటు కొత్త ప్రాజెక్టులకు స్థలాలిచ్చే యజమానులు టీడీఆర్ కన్నా తమకు నగదు నష్టపరిహారాన్ని మాత్రమే డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ సర్కారు టీడీఆర్ జారీకి నిబంధనలను సవరించటంతో మున్ముందు టీడీఆర్ కు మరింత ఆదరణ పెరిగే అవకాశముంది. ముఖ్యంగా హై రైజ్ భవనాలకు అనుకూలంగా ఈ సవరణలు చేసింది. 18 మీటర్ల ఎత్తు కల్గి ఉండాలన్న నిబంధనను కాస్త 21 మీటర్ల ఎత్తుకు పెంచుతూ సవరించింది.

అదనపు అంతస్తులకు అనుమతి

ప్లాట్ల పరిమాణం, రోడ్ల వెడల్పు ఆధారంగా అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సవరణలు నిర్మాణ రంగానికి ఊతమివ్వడంతో పాటు ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, హెచ్ సిటీ పనుల స్థల సేకరణ మరింత ఈజీగా పూర్తి చేసేందుకు అనుకూలంగా సవరణలున్నట్లు అదికారులు భావిస్తున్నారు. టీడీఆర్ వినియోగంలో స్పష్టత తీసుకువచ్చేలా కూడా సవరణలు తీసుకురావటంతో టీడీఆర్ ల వినియోగం, క్రయ విక్రయాలు కూడా బగా పెరిగే అవకాశముంది. ఇప్పటి వరకు టీడీఆర్ లు తీసుకున్న యజమానులకు కాసుల వర్షం కురిసే అవకాశముంది.

టీడీఆర్ డిమాండ్

తాజాగా చేసిన సవరణలు వెంటనే అమల్లోకి రానున్నట్లు సర్కారు వెల్లడించటంతో ఇప్పటి వరకు జారీ అయిన టీడీఆర్ కు కూడా డిమాండ్ పెరగనుందని చెప్పవచ్చు. 21 మీటర్ల కన్నా ఎక్కువ అంతస్తులున్న భవనాలను హై రైజ్ భవనాలుగా గుర్తించనున్నారు. 750 నుండి 2000 చదరపు మీటర్ల మధ్య ఉన్న ప్లాట్లలో 18 నుండి 21 మీటర్ల ఎత్తు గల భవనాలకు టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేసింది. హై రైజ్ భవనాల్లో కూడా 10 శాతం వరకు సెట్ బ్యాక్ లను సర్కారు సడలించింది. కానీ ఏడు మీటర్ల ఖాళీ స్థలం ఉండాలన్న నిబంధనను సర్కారు విధించినప్పటికీ, రెండు వేల చదరపు మీటర్లకన్నా ఎక్కువ సైజులో ఉన్న ప్లాట్లలో ప్లాట్ కు ఉన్న అప్రోచ్ రోడ్డును బట్టి 3 నుండి 5 అంతస్తుల వరకు అదనంగా నిర్మించేందుకు అనుమతి కల్పించటంతో ప్రైమ్ లోకేషన్లలో టీడీఆర్ కు డిమాండ్ బాగా పెరగనుంది.

రోడ్ల వెడల్పు ఆధారంగా అంతస్తుల

40 అడుగుల రోడ్డు చోట 3 అంతస్తులు, 60 అడుగుల రోడ్డున్న ప్రాంతంలో నాలుగు, 80 అడుగుల రోడ్డున్న ప్రాంతంలో అయిదు అంతస్తులను అదనంగా నిర్మించుకునే అవకాశం కల్పించటంతో చిన్న చిన్న బిల్డర్లు నిర్మాణాలపై మరింత ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. కానీ భవనాల సెట్ బ్యాక్ లను ప్రత్యేకంగా పర్యవేక్షించకుంటే ఒక రకంగా ఇరుగు రోడ్లలో అదనపు అంతస్తులు వచ్చి ట్రాఫిక్ సమస్య పెరిగే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా భవన అనుమతి సమయంలో 50 శాతం టీడీఆర్ సమర్పించి, మిగిలిన 50 శాతాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే ముందు సమర్పించవచ్చునన్న అవకాశమివ్వటంతో నిర్మాణాలు కూడా తీసుకున్న అనుమతికి లోబడే జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ సవరణలతో ఆస్తుల యజమానులు, డెవలపర్లలో టీడీఆర్ పట్ల ఉన్న సందేహాలు తొలగిపోవటంతో బిల్డింగ్ పర్మిషన్లు ప్ర్రక్రియ మరింత వేగవంతం కానుంది. నిర్మాణ రంగం ఊపందుకోవటంతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి దోహదపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీఆర్ వినియోగంపై స్పష్టత

2022 నుంచి ఇప్పటి జీహెచ్ఎంసీ సుమారు 37 కోట్ల 31లక్షల 957.85 చదరపు గజాల విస్తీర్ణానికి సుమారు 1569 టీడీఆర్ లను జారీ చేయగా,వీటిలో సుమారు 1200 పై చిలుకు టీడీఆర్ లు యుటిలిటీ కాగా, మరో 400 పై చిలుకు టీడీఆర్ లు యుటిలిటీ కాకుండా మార్కెట్ లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 20 కోట్ల, లక్షా 227.96 చదరపు గజాల టీడీఆర్ లు యుటిలిటీ కాగా, మరో 15 కోట్ల 36 లక్షల 598.33 చదరపు గజాల టీడీఆర్ లు మార్కెట్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు జారీ చేసిన టీడీఆర్ లలో మాస్టర్ ప్లాన్ లో స్థలాలు కొల్పొయిన వారికి 400 శాతం, చెరువులు, ఇతర వాటర్ బాడీల్లో స్థలాలు కొల్పోయిన వారికి 200 శాతం, హెరిటెజ్ భవనాల పునరుద్దరణలో భాగంగా స్థలాలు కోల్పొయిన వారికి వంద శాతం రేట్లతో వారు కోల్పోయిన స్థలాన్ని బట్టి టీడీఆర్ లు జారీ చేశారు.

Also Read: మొండి బకాయిలపై అధికారుల కొరడా.. సీజ్ అవుతున్న భారీ మాల్స్, హోటళ్లు!

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×