E-Paper
Advertisement

TG Health Department: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి ఆ శాఖకు ప్రభుత్వ హోదా..?

TG Health Department: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి ఆ శాఖకు ప్రభుత్వ హోదా..?
Advertisement

TG Health Department: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ హాస్పిటళ్లలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చాలని‌ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కేబినెట్ డీఎస్‌హెచ్‌‌ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ఇన్నాళ్లు అటానమస్ వ్యవస్థగా ఉన్న టీవీవీపీకి, ప్రభుత్వ విభాగం హోదా లభించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 1986లో అటానమస్ బాడీగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం టీవీపీపీ పరిధిలో కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లు కలిపి మొత్తంగా 184 హాస్పిటళ్లు పనిచేస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, టీచింగ్ హాస్పిటళ్లకు నడుమ బ్రిడ్జ్‌గా ఈ హాస్పిటళ్లలో ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలను టీవీవీపి అందిస్తోంది.

సెకండరీ హెల్త్ కేర్‌..

అయితే, టీవీవీపీ పూర్తిస్థాయిలో ప్రభుత్వశాఖ కాకపోవడంతో, బడ్జెట్ కేటాయింపులు, వేతనాల చెల్లింపు, తదితర అంశాల్లో జాప్యం జరుగుతోంది. దీంతో దీర్ఘకాలంగా టీవీవీపీ ఉద్యోగులు డైరెక్టరేట్ హోదా కల్పించాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు‌. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోనూ సెకండరీ హెల్త్ కేర్‌‌గా మార్చేశారు. దీంతో తెలంగాణలోనూ మార్చాలన్న డిమాండ్ పెరిగింది. వేతనాలు ఆలస్యంగా వస్తుండడం, ఈహెచ్‌ఎస్ వంటి బెనిఫిట్స్‌ లేకపోవడంతో వీవీపీ పరిధిలోని హాస్పిటళ్లలో పనిచేసేందుకు డాక్టర్లు కూడా ఇష్టపడడం లేదు.ఈ నేపథ్యంలో అటు ఉద్యోగుల డిమాండ్ నెరవేర్చడంతో పాటు, ఇటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టీవీవీపిని డీఎస్‌హెచ్‌గా మార్చాల్సిన అవసరాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గుర్తించారు.

Advertisement

Also Read: Desk Journalists: అక్రిడిటేషన్లలో డెస్క్ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం

బిల్లుకు కేబినెట్ ఆమోదం

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా నిపుణులతో పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించారు. విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, డీఎస్‌హెచ్‌ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపేలా మంత్రి చొరవ తీసుకున్నారు.ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో సగటున 4 నుంచి 6 హాస్పిటళ్లు టీవీవీపీ పరిధిలో ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఈ హాస్పిటళ్లలో డాక్టర్లు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయనున్నారు. అలాగే, హాస్పిటళ్లకు నిధుల కేటాయింపు పెరగనుంది. హాస్పిటళ్లు అన్నీ పూర్తిస్థాయి ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానున్నాయి. దీంతో వైద్య సేవలు మెరుగు అవనున్నాయి.

నాణ్యమైన వైద్య సేవలు

Advertisement

ప్రభుత్వ నిర్ణయం పట్ల టీవీవీపీ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. డైరెక్టరేట్‌గా మార్పు ద్వారా సెకండరీ హెల్త్ కేర్ సేవలపై మరింత కేంద్రీకృత పర్యవేక్షణ సాధ్యమవుతుందని, ఆసుపత్రుల నిర్వహణలో వేగం, పారదర్శకత పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. నిధుల వినియోగంలో సమర్థత పెరగడంతో పాటు సేవా, ఆర్థిక అంశాల్లో ఉద్యోగుల సమస్యలకు త్వరిత పరిష్కారం లభించనుంది. ఆరోగ్య శాఖలోని ఇతర విభాగాలతో సమన్వయం మెరుగుపడటంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.

ప్రభుత్వ డాక్టర్ల సంఘం

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ‌ , ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు , టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ లకు ప్రభుత్వ డాక్టర్ల సంఘం అసోసియేషన్ డాక్టర్లు నరహరి, లాలూ ప్రసాద్, రవూప్ , టీపీసీసీ మెడికల్ అండ్ డాక్టర్స్ వింగ్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ నాయక్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

Also Read: HBD Nani: నాని బర్తడే స్పెషల్..అసలు పేరేంటి.. ఈ క్రేజ్ వెనుక అంత కష్టం దాగుందా?

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×