E-Paper
Advertisement

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు.. ధరణిపై ‘సిట్’, కరువు పరిస్థితులపై సమీక్ష!

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు.. ధరణిపై ‘సిట్’, కరువు పరిస్థితులపై సమీక్ష!
Advertisement

Cabinet Decisions: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కీలక ప్రాజెక్టుల పురోగతి, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు వ్యవహారాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు, చర్చించిన అంశాల వివరాలు ఇప్పుడు మనం చూద్దాం..

ధరణి అక్రమాలపై ‘సిట్’ విచారణ..

Advertisement

గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ వేదికగా జరిగిన భూ అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి రాగానే దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించిన రేవంత్ సర్కార్, తాజాగా సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

మాజీ అధికారులు, బాధ్యులకు నోటీసులు..

Advertisement

భూ రికార్డుల మార్పులు, అక్రమ మ్యూటేషన్లు, ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూముల లావాదేవీలపై ఈ సిట్ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రతి అక్రమాన్ని వెలికితీస్తామని, బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే అక్రమాలకు పాల్పడిన మాజీ అధికారులు, బాధ్యులకు నోటీసులు జారీ చేసి, కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది.

కరువు పరిస్థితులపై ఆందోళన

దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికలపై కేబినెట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రస్తుతానికి 29 శాతం మించి వర్షపాతం నమోదు కాకపోవడంపై చర్చించారు. ఈ నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

Also Read:రూల్స్ బ్రేక్ చేస్తే నడిరోడ్డుపైనే సీజ్.. వాహనదారులకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్!

ఈ నెల 20వ తేదీన ప్రత్యక్ష సమావేశం..

పరిస్థితిని అంచనా వేయడానికి ఈ నెల 20వ తేదీన జిల్లా ఇంచార్జ్ మంత్రులు, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించనున్నారు. 10 ఉమ్మడి జిల్లాల నుండి పూర్తి నివేదికలు తెప్పించుకుని, ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రాన్ని కరువు పీడిత ప్రాంతంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే కేంద్ర కరువు బృందాలు రాష్ట్రంలో పర్యటించి సహాయం అందించేలా కోరాలని కేబినెట్ నిర్ణయించింది. రైతులకు ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

సాగునీటి ప్రాజెక్టులు.. జల వివాదాలు

నీటి లభ్యత, ప్రాజెక్టుల పురోగతిపై కేబినెట్ సుదీర్ఘంగా సమీక్షించింది. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల రీ-ఎస్టిమేషన్స్ పై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునర్నిర్మాణంపై కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీతో ఉన్న గోదావరి-బనకచర్ల వివాదంతో పాటు కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల అంశాలపై కూడా మంత్రులు చర్చించారు.

కొత్త టెండర్ల విధానం.. పాలనాపరమైన నిర్ణయాలు

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ టెండర్లపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, టెండర్ల ప్రక్రియ మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించిన తర్వాత కొత్త టెండర్ల విధానాన్ని అమలు చేయనున్నారు.

Also Read: యువసంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఇతర కీలక నిర్ణయాలు..

గ్రామపంచాయతీలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా కార్పొరేషన్లలో ఉండే 5గురు కోఆప్షన్ మెంబర్లలో ఒకరిని ట్రాన్స్‌జెండర్ వర్గానికి కేటాయించాలని సామాజిక దృక్పథంతో నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా.. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ఫేజ్-1 పనుల పురోగతిపై కేబినెట్ సమీక్ష జరిపింది. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు.

Related News

రూల్స్ బ్రేక్ చేస్తే నడిరోడ్డుపైనే సీజ్.. వాహనదారులకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్!

రైతులపై కక్షనా? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా? కాంగ్రెస్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

యువసంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బండి సంజయ్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం!

ఫిఫా ఫైనల్స్ ఎఫెక్ట్.. బార్ల పనివేళల పొడగింపు.. ఇక తెల్లార్లు ఎంజాయ్ పండగో!

ఎల్లంపేట్‌లో అక్రమ నిర్మాణాలు.. ఇళ్ల అనుమతులతో కమర్షియల్ షట్టర్లు!

అంతరిక్షంలోకి హైదరాబాద్ రాకెట్ ‘విక్రమ్ 1’ – దీని ప్రత్యేకతలు ఇవే!

Big Stories

Advertisement
×