E-Paper
Advertisement

రూల్స్ బ్రేక్ చేస్తే నడిరోడ్డుపైనే సీజ్.. వాహనదారులకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్!

రూల్స్ బ్రేక్ చేస్తే నడిరోడ్డుపైనే సీజ్.. వాహనదారులకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

Transport Enforcement: స్వేచ్ఛ బ్యూరో: రవాణాశాఖ ఎన్ ఫోర్స్ మెంట్ ను మరింత పటిష్టం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని రావాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత విస్తృతంగా చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఫిటినెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి..

Advertisement

ఓవర్‌లోడింగ్ చేస్తున్న వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్‌నెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలను అవసరమైతే సీజ్ చేయాలని ఆదేశించారు. చెక్‌పోస్టులు రద్దు చేసిన సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

వాహనాలు సీజ్..

Advertisement

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందిని మరింత సమర్థవంతంగా వినియోగించి తనిఖీలను పెంచాలని సూచించారు. జూన్ 8 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేసిన మొబైల్ స్క్వాడ్ ల పని తీరును సమీక్షించారు. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయాలని అన్నారు.

అధికారులకు మంత్రి ఆదేశాలు..

అలాగే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించవద్దని, ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్,రవాణా శాఖ కమిషనర్ ఇలంబరితి, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్, జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్లు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, డీటీసీలు పుల్లెంల రవీందర్ కుమార్, వెంకట రమణ, సురేష్ రెడ్డి, ప్రమీల, వాణి, సదానందం, ఆఫ్రిన్, ఓ ఎస్ డీ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: యువసంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×