E-Paper
Advertisement

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?
Advertisement

Number 108 history : 108…ఈ పదం మన హిందూ సంప్రదాయంలో భాగా వినిపిస్తుంది.గుడికి వెళ్తే 108 ప్రదక్షిణలు చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. దేవుడికి పూజ చేస్తే 108 నామాలు చదవాల్సిందే.ఇక మీరు సరిగ్గా చూస్తె జపం చేసే మాలలో కూడా సరిగ్గా 108 పూసలే ఉంటాయి.మరింతకీ ఈ 108 అనే సంఖ్యకి ఎందుకింత క్రేజో ఎప్పుడైనా ఆలోచించారా ?

దీని వెనుక కేవలం నమ్మకాలు మాత్రమే కాదండోయ్.బోలెడంత సైన్స్, మ్యాథ్స్, ఖగోళ రహస్యాలు కూడా దాగున్నాయి.ఎలా అంటారా ..జ్యోతిష్యం పరంగా చూస్తే, మనకు 12 రాశులు, 9 గ్రహాలు ఉన్నాయని తెలుసు కదా. ఈ 12ని 9తో గుణిస్తే సరిగ్గా 108 వస్తుంది. అంటే విశ్వంలో ఉండే శక్తులన్నింటినీ ఈ నెంబర్ రిప్రెసెంట్ చేస్తుందన్నమాట. అలాగే మన నక్షత్రాలు 27. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 27ని 4తో మల్టిప్లై చేసినా మళ్ళీ 108 వస్తుంది. అంటే మొత్తం నక్షత్ర మండలానికి ఈ 108 ఒక సింబల్ లాంటిదన్నమాట.. మొత్తానికి ఎన్నో వేల ఏళ్ల క్రితమే మన పెద్దలు వీటన్నింటినీ కనిపెట్టి ఈ నెంబర్‌ని ఇలా అత్యంత పవిత్రంగా మార్చేశారన్న మాట.

Advertisement

భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరం… 

ఇక సైన్స్, స్పేస్ విషయానికి వస్తే మైండ్ బ్లాక్ అయిపోవడం పక్కా. ఎందుకంటారా ..భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరం… సూర్యుడి వ్యాసం (డయామీటర్) కంటే సరిగ్గా 108 రెట్లు ఎక్కువ ఉంటుంది మరి.అలాగే భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం కూడా చంద్రుడి వ్యాసానికి దాదాపు 108 రెట్లు ఉంటుందట.పోనీ సూర్యుడి సైజ్ చూద్దామంటే, అది కూడా భూమి సైజ్ కన్నా 108 రెట్లు పెద్దది.

Advertisement

నిజంగా టెలిస్కోప్‌లు, పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్లు లేని ఆ కాలంలోనే మన ఋషులు ఈ విశ్వ రహస్యాన్ని కనిపెట్టడం నిజంగా ఆశ్చర్యపరిచేదే .అందుకే మన శరీరానికి, విశ్వానికి ఉన్న కనెక్షనే ఈ 108 అంటారు.

మన బాడీలో కూడా  ఒక సీక్రెట్

ఇంతేకాదండోయ్..యోగా శాస్త్రం ప్రకారం కూడా మన బాడీలో ఒక సీక్రెట్ ఉంది. అదేంటో తెలుసా ..మన శరీరంలో ప్రవహించే ముఖ్యమైన ఎనర్జీ నాడులన్నీ హృదయ చక్రం దగ్గర కలిసి, మొత్తం 108 ముఖ్యమైన ఎనర్జీ పాయింట్స్ (వీటినే మర్మ స్థానాలు అంటుంటారు) క్రియేట్ అవుతాయట.అందుకే జపం చేసేటప్పుడు లేదా ధ్యానం చేసేటప్పుడు ఒక మంత్రాన్ని 108 సార్లు జపిస్తే, ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన ఒంట్లోని ఈ 108 పాయింట్స్‌ని యాక్టివేట్ చేస్తాయట. జపమాలలో 108 పూసలు పెట్టడానికి అసలు కారణం ఇదే.

భరతనాట్యంలో ఉండే భంగిమలు కూడా 108

ఇక మ్యాథ్స్ పరంగా చూసినా 108 చాలా స్పెషల్. ఇందులో ‘1’ అంటే దేవుడు లేదా సృష్టి మొదటిగా అనుకుంటే’0′ అంటే ఏమీ లేని శూన్యం లేదా మనలో అహంకారం లేకపోవడం. ఇక ‘8’ అంటే ఎండ్ లేదా అనంతత్వం అని హిస్టరీ చెబుతున్న సత్యం.అలాగే మన ఆధ్యాత్మిక గ్రంథాలైన ఉపనిషత్తులు కూడా ముఖ్యమైనవి 108 ఉంటే దేశంలో ప్రసిద్ధ వైష్ణవ దివ్యదేశాలు 108, శైవ క్షేత్రాలు 108, చివరికి భరతనాట్యంలో ఉండే భంగిమలు కూడా 108 కావడం విశేషం.

బౌద్ధ, జైన మతాల్లో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత

ఇక ఈ సంఖ్యకున్న క్రేజ్ కేవలం మన హిందూ ధర్మానికే పరిమితం కాలేదు. బౌద్ధ, జైన మతాల్లో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారట. టిబెటన్ బౌద్ధ గ్రంథాలు కూడా108 భాగాలుగా ఉంటాయట .ఇక జపాన్‌లో అయితే ఒక వెరైటీ ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సరం వచ్చే ముందు గుడి గంటలను సరిగ్గా 108 సార్లు మోగిస్తారట.మనుషుల్లో ఉండే 108 రకాల ఆశలు, కోపతాపాలు, బలహీనతలను వదిలించుకుని కొత్త ఏడాదిలోకి పవిత్రంగా అడుగుపెట్టడానికి ఇదొక సింబల్ అని అక్కడి వారి నమ్మకం. ఇదండీ 108 అనే సంఖ్య యొక్క విశిష్టత. ఇప్పటికైనా ఈ సంఖ్యకి ఇంత క్రేజ్ ఎందుకో అర్థం అయిందనుకుంటా !

Related News

కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

ఒకే దెబ్బకు రెండు నిర్ణయాలు.. సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ మార్పులపై రచ్చ!

తెలంగాణలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. ప్రాణాలు కాపాడే మందుల వెనుక పల్లెల వినాశనం!

కొత్త పార్టీ ప్రకటనతో విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. జగన్‌కు చెక్ పడినట్టేనా..!

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఉచిత రిజిస్ట్రేషన్లతో పేదలకు అపార్ట్‌మెంట్లు!

Big Stories

Advertisement
×