E-Paper
Advertisement

Bus Accident: విజయనగరంలో జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు.. 42 మంది స్పాట్ లో

Bus Accident: విజయనగరంలో జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు.. 42 మంది స్పాట్ లో
Advertisement

Bus Accident: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భువనేశ్వర్ నుండి మల్కాజిగిరి వైపు వెళ్తున్న ఈ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బస్సు వెనుక వైపు ఉన్న టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు మొదలై, చూస్తుండగానే వాహనం మొత్తం విస్తరించాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో పెను ముప్పు తప్పింది.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. టైర్ పేలిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులను హుటాహుటిన కిందకు దించేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రాణనష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రయాణికులు తమ విలువైన సామాగ్రిని కూడా తీసుకోలేనంత వేగంగా మంటలు వ్యాపించడంతో, ప్రయాణికుల బ్యాగులు, ఇతర వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.

Advertisement

ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఆయన కూడా క్షేమంగానే ఉన్నారని, అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉందని తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు బస్సు కేవలం అస్థిపంజరంలా మారిపోయింది. మంటల ధాటికి బస్సు విడిభాగాలు కరిగిపోయి భీతావహ దృశ్యం కనిపిస్తోంది.

Also Read: షీ టీమ్స్​ చూస్తున్నాయ్.. హద్దు దాటితే కటకటాలే.. తస్మాత్ జాగ్రత్త!

Advertisement

ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం కారణంగా వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ చేపట్టారు. భారీ ప్రమాదం జరిగినప్పటికీ, ఒక్కరికి కూడా గాయాలు కాకపోవడం గమనార్హం.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×