E-Paper
Advertisement

ఈఎస్‌ఐ పీఠంపై కన్ను.. ఎంపీ, మంత్రి కార్యాలయాల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు

ఈఎస్‌ఐ పీఠంపై కన్ను.. ఎంపీ, మంత్రి కార్యాలయాల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు
Advertisement

ESI Director: స్వేచ్ఛ బ్యూరో: లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కీలకమైన ఈఎస్‌ఐ విభాగం మరోసారి  చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకమైన ఈఎస్‌ఐ డైరెక్టర్‌ పోస్టు భర్తీ ప్రక్రియ అధికారిక, రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. కోట్ల రూపాయల బడ్జెట్, వేలాది మందికి సేవలు అందించే పరిపాలనా ప్రాధాన్యత కలిగిన ఈ పోస్టు దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, ఈ కీలకమైన బాధ్యతలు ఎవరికి దక్కుతాయి? సీనియారిటీ, సామర్థ్యానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందా? లేక గతంలో లాగా ఐఏఎస్ అధికారికే విభాగాన్ని పరిమితం చేస్తుందా? అన్న ప్రశ్నలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరడంతో ఉద్యోగులు, అధికారులు హాట్ టాపిక్ గా నిలిచింది.

రేసులో ఐదుగురు సూపరింటెండెంట్లు..

Advertisement

ఈ ఎస్ ఐ డైరెక్టర్ రేసులో ప్రస్తుతం ఐదుగురు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావుతో పాటు మరొక కీలక ఈఎస్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్‌సత్యనారాయణ ఈ పోస్టు దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితాలో వీరు మొదటి మూడు స్థానాల్లో లేకపోవడం గమనార్హం. ఒకరు సీనియారిటీ ప్రకారం 4వ స్థానంలో, మరొకరు 5వ స్థానంలో ఉన్నారు. అయినా సరే తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సీనియర్లను దాటుకుని డైరెక్టర్ పదవి కొట్టేయాలని తీవ్రంగా యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ​ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన ఓ కీలక ఎంపీ సహకారంతో ఒక అధికారి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఐఏఎస్‌కే ఇవ్వాలనే డిమాండ్..

Advertisement

2019లో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ లో జరిగిన మందులు, వైద్య పరికరాల కొనుగోలు అక్రమాల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టడంతో ఏసీబీ దర్యాప్తు చేపట్టి పలువురు అధికారులను అరెస్ట్ కూడా చేసింది.​ఈ నేపథ్యాన్నే పునరావృతం కాకుండా చూడాలంటే.. కార్పొరేట్ మరియు రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని పారదర్శకంగా వ్యవహరించే ఐఏఎస్‌  అధికారికి డైరెక్టరేట్ బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదనలు మళ్లీ తెర మీదకు వచ్చింది.నాన్-ఐఏఎస్ అధికారులకు పూర్తి బాధ్యతలు ఇస్తే తిరిగి నిధుల దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని ఉద్యోగుల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు.వాస్తవానికి ​ఈఎస్‌ఐ ఆస్పత్రులు కేవలం సాధారణ సర్కారు దవాఖానాలు కావు. పరిశ్రమలు, ఐటీ, ఇతర ప్రైవేటు సంస్థల్లో కష్టపడి పని చేస్తూ నిరంతరం చందాలు చెల్లించే కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఈ సంస్థపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ సిఫార్సులతో కాకుండా కేవలం అనుభవం, నిష్కళంకమైన రికార్డు, నిజాయితీ కలిగిన అధికారులను మాత్రమే ఈ పోస్టులో నియమించాలనీ ఉద్యోగులు కోరుతున్నారు.

కార్మిక సంఘాలు డిమాండ్

ఇక ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు సకాలంలో చెల్లించేలా కొత్త డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.అంతేగాక వైద్య పరికరాలు, మందుల సరఫరా టెండర్లలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఈ-టెండరింగ్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలి. పదవుల కోసం అధికారుల మధ్య నడుస్తున్న పోటీ, రాజకీయ పైరవీల కంటే కార్మికుల సంక్షేమమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండాలని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే దళారులకే అమ్ముకోండి.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే దళారులకే అమ్ముకోండి.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!

‘తెలంగాణ ఎండిపోతుంటే నీకేం పని అక్కడ’? సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాంచందర్ రావు!

కేటీఆర్.. ఆ సుద్దపూస మాటలు బంద్ చేయ్! మీ తప్పులు ప్రజలకు తెలుసు: ఎంపీ చామల

బొగ్గు కాదు.. ఇక సింగరేణిలో బంగారం, లిథియం తవ్వకాలు: భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్!

డిండి ఎత్తిపోతల పథకం పూర్తిగా రద్దు.. ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్!

మహబూబ్‌నగర్ జిల్లాలో ఎల్ నినో విలయం.. 30 నుంచి 41 శాతం పడిపోయిన జలాలు!

హరీష్‌రావు పై మెట్టు సాయికుమార్ సంచలన ఆరోపనలు.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×