E-Paper
Advertisement

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జర్మనీ అవకాశాలపై ఫోకస్.. విదేశాల్లో యువతకు శిక్షణ!

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జర్మనీ అవకాశాలపై ఫోకస్.. విదేశాల్లో యువతకు శిక్షణ!
Advertisement

Overseas Jobs: రాష్ట్రంలోని చదువుకున్న యువతలో విదేశీ ఉపాధిపై ఆసక్తి పెంచేందుకు తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా జర్మనీకి అవసరమైన నైపుణ్యాలు, భాషా ప్రావీణ్యంతో పెద్ద సంఖ్యలో యువతను శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. విజయవంతమైన ప్లేస్‌మెంట్‌లు ఇతర యువతను కూడా విదేశీ ఉద్యోగాల వైపు ఆకర్షిస్తాయని ఆయన పేర్కొన్నారు.

సామవారం సచివాలయంలోని తన ఛాంబర్ లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ బోర్డు (TOMCOM) సమావేశానికి మంత్రి వివేక్ వెంకటస్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో విదేశీ ఉపాధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. జర్మనీలో నైపుణ్య కార్మికులకు, చదువుకున్న యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

Advertisement

ఈ క్రమంలోనే క్యాపాసిటీ బిల్డింగ్ ప్రాముఖ్యతను ప్రస్తావించి మంత్రి వివేక్ వెంకటస్వామి.. ‘ట్రైనర్స్‌కు శిక్షణ’ (ట్రైనింగ్ ది ట్రైనర్స్) అత్యంత అవసరమని చెప్పారు. భాషా బోధన కోసం నైపుణ్యం కలిగిన ట్రైనర్లను వెంటనే నియమించాలని ముఖ్యంగా జర్మన్ భాషా శిక్షణను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

జర్మనీలోని అవకాశాలను తెలంగాణ యువత వినియోగించుకునేలా TOMCOM చురుగ్గా పనిచేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను అందించే విశ్వసనీయ అధికారిక సంస్థగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు జీసీసీ దేశాల్లో కార్మికుల నియామకాలపై జరుగుతున్న చర్యల గురించి.. అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో పనిచేస్తున్న కార్మికుల నుంచి నిరంతరం అభిప్రాయాలను సేకరించి, నివేదికలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు.

Advertisement

Also Read: AC Side Effects: ఏసీ అతిగా వాడుతున్నారా? ఈ జబ్బులకు రెడీగా ఉండండి.. ఏ క్షణమైనా..!

ప్రతి దేశానికి ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుందని, ఆ దేశాల సంస్కృతిపై కూడా యువతకు అవగాహన కల్పించేలా శిక్షణ ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. టామ్ కమ్ ద్వారా శిక్షణ, నియామకాల విషయంలో లక్ష్యాధారిత ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. టామ్ కమ్ పనితీరును, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలని, విదేశీ ఉపాధి కార్యక్రమాల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని మంత్రి అన్నారు. రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలను కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పునరుద్ఘాటించారు.

Also Read: బాబ‌ర్ ఆజంను చిత‌క‌బాదిన అమెరికా పోలీసులు.. షాకింగ్ ఫోటోలు వైర‌ల్ ?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×