E-Paper
Advertisement

సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్రమాలు కలకలం

సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్రమాలు కలకలం
Advertisement

Fake Records: స్వేచ్ఛ బ్యూరో: రికార్డుల ఫోర్జరీ, మహిళా సిబ్బందిపై వేధింపులు   

  • పీహెచ్‌సీ సూపర్‌వైజర్ రమేష్ సరెండర్ 
  • డిప్యూటీ DM&HO పై దుష్ప్రచారం.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు. 

విధుల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడుతూ, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) హెల్త్ సూపర్‌వైజర్ (MPHS-M) సోమ రమేష్‌ను జిల్లా కార్యాలయానికి సరెండర్ చేస్తూ హుజూరాబాద్ డివిజన్ డిప్యూటీ DM&HO డాక్టర్ గొట్టె శ్రవణ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

​నకిలీ రిజిస్టర్ల మాయాజాలం

Advertisement

​ఉన్నతాధికారుల అనుమతి లేకుండా భవిష్యత్తు తేదీలకు ముందే హాజరు సంతకాలు చేయడం, తనిఖీ అధికారులను బురిడీ కొట్టించడానికి ఏకంగా ఒక ‘నకిలీ సమాంతర హాజరు రిజిస్టర్’ నిర్వహించడం వంటి అక్రమాలు విచారణలో రుజువయ్యాయి. కేటాయించిన సెక్టార్లకు వెళ్లకుండా పాత వాట్సప్ ఫోటోలతో అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, ఈ నెల 19న రమేష్ హాజరుపై వైద్యాధికారి ప్రశ్న గుర్తు (?) పెట్టగా, దానిని చెరిపేసి రికార్డులను ట్యాంపరింగ్ చేశారు. ఇది తెలంగాణ సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని అధికారులు తెలిపారు. తోటి మహిళా వైద్య సిబ్బందిని రమేష్ నిరంతరం దూషిస్తూ, అవహేళనగా మాట్లాడుతున్నట్లు బాధితులు చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి ఈ సరెండర్ చర్యలు తీసుకున్నారు.

Also Read: మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న ‘SIR’ మంత్రం

డిప్యూటీ DM&HO పై దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు

Advertisement

​తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారనే కక్షతో హెల్త్ సూపర్‌వైజర్ సోమ రమేష్ సరికొత్త వివాదానికి తెరలేపారు. శనివారం సాయంత్రం 4 గంటల నుండి స్థానిక ‘సైదాపూర్ ప్రింట్ & ఎలక్ట్రానిక్’ వాట్సప్ గ్రూపులతో పాటు పలు సోషల్ మీడియా వేదికల్లో డిప్యూటీ DM&HO డాక్టర్ గొట్టె శ్రవణ్ కుమార్‌పై అబద్ధపు ఆరోపణలతో దుష్ప్రచారం సాగించారు. ​దీనిపై డిప్యూటీ DM&HO డాక్టర్ శ్రవణ్ కుమార్ తీవ్రంగా స్పందిస్తూ సైదాపూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియా వేదికగా..

నియమ నిబంధనల ప్రకారమే తాను సమగ్ర విచారణ జరిపి రమేష్‌పై చర్యలు తీసుకున్నానని, అయితే రమేష్ సోషల్ మీడియా వేదికగా తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, డిజిటల్ సాక్ష్యాలను పోలీసులకు సమర్పించిన ఆయన.. ఈ అబద్ధపు ప్రచారాల చైన్‌ను బ్రేక్ చేసి, సదరు ఉద్యోగిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read: ప్రశ్నిస్తే అక్రమ కేసులా?.. చంద్రబాబు సర్కార్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×