E-Paper
Advertisement

కాళేశ్వరం మేడిగడ్డ ఆఫీసులో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు దగ్ధం

కాళేశ్వరం మేడిగడ్డ ఆఫీసులో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు దగ్ధం
Advertisement

Medigadda: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద తీవ్ర కలకలం రేగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ (L&T) కార్యాలయంలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయం పక్కన ఉన్న పంట పొలాలలో రైతులు వ్యర్థాలను తగలబెట్టగా, వడగాలుల ప్రభావంతో ఆ మంటలు ఎల్ అండ్ టీ ఆఫీస్ వైపునకు వ్యాపించాయి. ఈ భవనాన్ని పూర్తిగా ప్లైవుడ్‌తో నిర్మాణం చేయడంతో మంటలు క్షణాల్లో ఆఫీస్ అంతటా వేగంగా వ్యాపించి, భవనం పూర్తిగా దగ్ధమైంది.

ఈ ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, దాని నిర్వహణకు సంబంధించిన ఎన్నో కీలకమైన ఫైళ్లు, కంప్యూటర్లు, అధికారిక డాక్యుమెంట్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతున్న తరుణంలో, దానికి సంబంధించిన రికార్డులు ఉన్న ఆఫీస్ తగలబడటం స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకునే లోపే కార్యాలయం పూర్తిగా కాలిపోయింది. మంటలు భారీగా ఎగసిపడటంతో వాటిని అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కాగా, ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ లేదా పొలాల్లోని మంటల వల్ల జరిగిందా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టంపై కాసేపట్లో ఎల్ అండ్ టీ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

Also Read: ప్రశ్నిస్తే అక్రమ కేసులా?.. చంద్రబాబు సర్కార్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×