E-Paper
Advertisement

Building Rules: భవన నిర్మాణాలకు కొత్త రూల్స్.. 20 అంతస్తులు దాటితే ఈ నిబంధనలు పాటించాల్సిందే!

Building Rules: భవన నిర్మాణాలకు కొత్త రూల్స్.. 20 అంతస్తులు దాటితే ఈ నిబంధనలు పాటించాల్సిందే!

Building Rules:  భవన నిర్మాణ రంగం మరింత పారదర్శకంగా,సౌకర్యవంతంగా సాగేలా తెలంగాణ భవన నిర్మాణ నిబంధనలు-2012కు కీలక సవరణలు చేస్తూ ప్రభుత్వం జీఓ నెం.95ను విడుదల చేసింది. ఈ సవరణల వల్ల టీడీఆర్ (ట్రాన్స్ ఫర్బుల్ డెవలప్ మెంట్ రైట్) వినియోగానికి ప్రాధాన్యత పెరగడమే కాకుండా, ఎత్తు పెంచుకునే భవనాలకు స్పష్టమైన మార్గదర్శకాలు లభించాయని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా హై–రైజ్ భవనాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. పాత నిబంధనలను సవరిస్తూ, ఇకపై 21 మీటర్లు , అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను మాత్రమే ‘హై-రైజ్ భవనాలు’గా పరిగణిస్తారని క్లారిటీ ఇచ్చారు.అయితే, చిమ్నీలు, కూలింగ్ టవర్లు, లిఫ్ట్ మెషిన్ రూమ్‌లు , వాటర్ ట్యాంకులు, కోల్డ్ స్టోరేజ్ లు, ఇండస్ట్రీయల్ వంటి బిల్డింగ్ ల నిర్మాణాలకు ఈ రూల్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

Also Read:Land Resurvey: భూముల వివాదాలకు చెక్.. 373 గ్రామాల్లో రీ సర్వే స్టార్ట్.. డ్రోన్లతో భూముల మ్యాపింగ్! 

కొత్త రూల్స్ ఇలా

​కొత్త నిబంధనల ప్రకారం టీడీఆర్ సమర్పించడం తప్పనిసరి అంటూ పేర్కొన్నారు. అయితే 750 నుండి 2000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ప్లాట్లలో 18 నుండి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలు నిర్మించాలంటే టీడీఆర్ వినియోగం తప్పనిసరి అని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. నాన్-హైరైజ్ భవనాల్లో రోడ్డు విస్తరణ దృష్ట్యా సెట్ బ్యాక్ సడలింపుల కోసం టీడీఆర్ వాడవచ్చన్నారు. అంతేగాక హై-రైజ్ భవనాల్లో నిర్ణీత సెట్ బ్యాక్‌లలో 10 శాతం వరకు సడలింపు పొందవచ్చు. కానీ ఆ భవనం చుట్టూ కనీసం 7 మీటర్ల ఖాళీ స్థలం మాత్రం తప్పనిసరింగా ఉండాల్సిందే. మాస్టర్ ప్లాన్ రోడ్లలో మార్పులు , తొలగింపులు జరిగినప్పుడు, డెవలప్‌మెంట్ ఛార్జీలకు బదులుగా టీడీఆర్‌ను సమర్పించే వెసులుబాటు కల్పించారు.

ఎక్స్ ట్రా అంతస్తుల అనుమతి ఇలా

2000 చదరపు మీటర్లకు మించిన ప్లాట్లలో, రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 40 అడుగుల రోడ్డులో 3 అదనపు అంతస్తులు, 60 అడుగుల రోడ్డులో 4 అంతస్తులు, 80 అడుగుల రోడ్డులో 5 అదనపు అంతస్తుల వరకు ఇవ్వనునట్లు తెలిపారు. అయితే టీడీఆర్ తో పాటు ఫైర్, ఎయిర్ పోర్ట్ రూల్స్ స్పష్టంగా పాటించాల్సిందేనని జీవోలో పొందుపరిచారు. మరోవైపు 10 నుండి 20 అంతస్తుల లోపు భవనాలు 10వ అంతస్తు పైన ఉండే మొత్తం విస్తీర్ణంలో 3 శాతం టీడీఆర్ సమర్పించాలి. 20వ అంతస్తు పైన ఉండే విస్తీర్ణంలో 5 శాతం టీడీఆర్ ఉండాలి. అయితే భవన నిర్మాణ అనుమతి సమయంలో నే 50 శాతం టీడీఆర్ , మిగతావి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందే ముందు మరో 50 శాతం టీడీఆర్ సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Also Read: Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×