E-Paper
Advertisement

Telangana Forests development: కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్ రిజర్వ్‌లకు మహర్దశ.. అటవీ పునరుద్ధరణే లక్ష్యంగా సర్కార్ అడుగులు

Telangana Forests development: కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్ రిజర్వ్‌లకు మహర్దశ.. అటవీ పునరుద్ధరణే లక్ష్యంగా సర్కార్ అడుగులు
Advertisement

Telangana Forests development:  స్వేచ్ఛ, బ్యూరో: కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులకు మహర్దశపట్టనుంది. ప్రభుత్వం గతం కంటే ఈ సారి అధిక నిధులు కేటాయించింది. టైగర్ రిజర్వులను అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించింది. డ్రోన్లు, స్మార్ట్ కెమెరాలతో పాటు డాగ్ స్వ్కాడ్ లతో అటవీకి రక్షణ చర్యలు చేపడుతుంది. దీంతో పర్యాటకుల సంఖ్య సైతం పెరగనుంది. దీనికి తోడు టైగర్ ట్రాకర్లుగా, గైడ్లుగా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వబోతోంది.

టైగర్‌ టూరిజంకు శ్రీకారం

అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలోని ప్రధాన పులుల సంరక్షణ కేంద్రాలైన మంచిర్యాల జిల్లా కవ్వాల్‌, నాగర్​ కర్నూల్​ జిల్లా మన్ననూరు (అమ్రాబాద్‌) టైగర్​ రిజర్వ్ లపై దృష్టిసారించింది. పర్యాటకులను ఆకర్షించేలా టైగర్‌ టూరిజంకు శ్రీకారం చుట్టబోతుంది. అందుకు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండగా, మన్ననూర్ జంగిల్ రిసార్ట్, సఫారీ రైడ్‌లు, దట్టమైన అడవులలో ట్రెక్కింగ్ సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. పర్యాటకులకు చిరుతపులులు, పులులు, వన్యప్రాణులను చూసే అవకాశం ఉంది. అదే విధంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​ మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉండగా మహారాష్ట్ర నుంచి పులులు రావడంతో ఈ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. అయితే వాటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తుంటారు. దానిని దృష్టిలో ఉంచుకొని పర్యాటకుల కోసం అత్యుధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈసారి బడ్జెట్ లో రూ.875 కోట్లు కేటాయించింది. ప్రణాళిక బద్దంగా ఖర్చుచేసి ఒకవైపు అటవీని, మరోవైపు మౌలిక వసతులు కల్పించబోతున్నారు.

Advertisement

Also Read:Building Rules: భవన నిర్మాణాలకు కొత్త రూల్స్.. 20 అంతస్తులు దాటితే ఈ నిబంధనలు పాటించాల్సిందే!

కంపా నిధులు మంజూరు

నిరంతరం అడవిలో పులుల కదలికలపై నిఘా ఉంచేందుకు వీలుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు బేస్ క్యాంప్‌లను నిర్మించనున్నారు. అడవిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే తెగలను, అక్రమంగా వచ్చేవారిని అడ్డుకునేందుకు ఇప్పటికే నిఘా ఏర్పాటు చేశారు. మరింత పర్యవేక్షణకు స్మార్ట్ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో నిఘా పెంచబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పులులు ఉచ్చులకు చిక్కుకొని మృతి చెందుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అయింది. ఉచ్చులను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల్లోకి రాకుండా అడవిలోనే సోలార్ బోర్ వెల్స్, సాసర్ పిట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కేంద్రం సైతం కంపా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ రాష్ట్రం.. సైతం అటవీలో వన్యప్రాణులకు మరిన్ని వసతులు కల్పించేందుకు పులులకు ఆహారంగా ఉండే జింకలు, అడవి పందులు, నీల్గాయ్ వంటి జంతువుల సంఖ్యను పెంచేందుకు గడ్డి మైదానాలను శాస్త్రీయంగా అభివృద్ధి చేయబోతున్నారు. అటవీ సంరక్షణలో స్థానిక చెంచులను, గిరిజనులను టైగర్ ట్రాకర్స్ గా నియమించి, వారికి ఉపాధి కల్పించడంతో పాటు అటవీ రక్షణలో భాగస్వాములను చేయబోతున్నట్లు సమాచారం.

ఎకో టూరిజం బలోపేతంపై ప్రభుత్వం ఫోకస్

Advertisement

ఎకో టూరిజం బలోపేతంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రకృతి ప్రేమికులకు అనుభూతిని కల్పించేందుకు మన్ననూరు, కవ్వాల్ ప్రాంతాల్లో పర్యావరణహిత కాటేజీలు, లగ్జరీ టెంట్లను నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణానికి హాని కలగకుండా ఎకో కాటేజీలను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అటవీ ప్రాముఖ్యతను తెలిపేలా డిజిటల్ మ్యూజియంలు, ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. అడవిలోని పక్షులను వీక్షించేందుకు ప్రకృతి నడక కోసం ప్రత్యేక మార్గాలను అభివృద్ధి చేయనున్నారు. టెలిస్కోపులతో కూడిన వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం టైగర్ రిజర్వు ఫారెస్టుల బలోపేతంపై దృష్టిసారించింది.

Also Read: Land Resurvey: భూముల వివాదాలకు చెక్.. 373 గ్రామాల్లో రీ సర్వే స్టార్ట్.. డ్రోన్లతో భూముల మ్యాపింగ్!

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×