E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?
Advertisement

Blockchain Registration: రాష్ట్రంలో భూమి రిజిస్ట్రేషన్ల వ్యవస్థను మరింత పారదర్శకంగా,ట్యాంపర్-ఫ్రూఫ్‌గా మార్చేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ చేపట్టిన అత్యాధునిక ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలుకు గ్రేటర్ హైదరాబాద్ (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు) పరిధిలోని భూములు చిక్కుముడిగా మారాయి. భూమి హక్కుల్లో స్పష్టత తెచ్చి, ఫోర్జరీలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంటే,గ్రేటర్ పరిధిలో పేరుకుపోయిన చారిత్రక రికార్డుల గందరగోళం, డూప్లికేట్ సర్వే నంబర్లు అధికారులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే రెండు మూడు దఫాలుగా అధికారులు ఆయా జిల్లాల పరిధిలోని భూములను సర్వే చేశారు. త్వరలోనే అన్ని భూములపై స్పష్టత వస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. మిగతా జిల్లాల్లో రికార్డులు క్లియర్ గా ఉన్నప్పటికీ, బ్లాక్ చైన్ సిస్టమ్ కు గ్రేటర్ భూములు సవాల్ గా మారాయని ఆయన వెల్లడించారు.

బ్లాక్ చైన్ సిస్టమ్ అంటే ఏమిటి? ఎందుకు ఈ జాప్యం?

బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది భూ రికార్డులను ఒకసారి డిజిటలైజ్ చేసిన తర్వాత ఎవరూ మార్చడానికి, ట్యాంపరింగ్ చేయడానికి వీలులేని ఒక అత్యున్నత డిజిటల్ నెట్‌వర్క్. ఈ సిస్టమ్‌లోకి డేటాను నమోదు చేయాలంటే ‘ప్రాథమిక రికార్డు ‘ నూరు శాతం పక్కాగా ఉండగాలి. డేటాలో తప్పులు ఉన్నా…ఒకే భూమికి ఇద్దరు హక్కుదారులు ఉన్నా బ్లాక్ చైన్ సిస్టమ్ ఆమోదించదు. గ్రేటర్ పరిధిలోని లక్షలాది ఎకరాల నాన్-అగ్రికల్చర్ ల్యాండ్స్‌కు సంబంధించి సరైన మ్యాపింగ్, టైటిల్ క్లారిటీ లేకపోవడంతో బ్లాక్ చైన్ నెట్‌వర్క్ ప్రిపరేషన్ మందగించింది. అంతేగాక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశాబ్దాలుగా ఉన్న విలీన గ్రామాలు, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్‌మెంట్ ఏరియాల్లో ‘ఒకే సర్వే నంబర్ పలు చోట్ల పునరావృతం కావడం, ఒకే సర్వే నంబర్‌పై పదుల సంఖ్యలో సబ్-డివిజన్లు ఏర్పడటంతో సమస్య చిక్కుముడిగా మారింది.

Advertisement

Also read: చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

22 ఏ జాబితా..

ఇక నిజాం కాలం నాటి పహానీలు, ఖస్రా పహానీలకు, ఇప్పటి అర్బన్ లేఅవుట్లకు పొంతన కుదరడం లేదు. మరోవైపు గతంలో ఒకే సర్వే నంబర్‌ను చూపిస్తూ వేర్వేరు డాక్యుమెంట్లతో ప్లాట్లు చేసి విక్రయించడంతో ఒకే భూమిపై పలు క్లెయిమ్‌లు నమోదయ్యాయి. కాగితాలపై సర్వే నంబర్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సరిహద్దులు స్పష్టంగా లేకపోవడం వల్ల ఆ భూమిని బ్లాక్ చైన్ కోడ్‌లోకి మ్యాప్ చేయడం సాధ్యపడటం లేదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. అంతేగాక లింక్ డాక్యుమెంట్లు, కోర్టు వివాదాలు, వక్ఫ్​ ఇనామ్, 22 ఏ జాబితా ఇలాంటివన్నీ ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ నెమ్మదించడానికి కారణమయ్యాయి.

డిజిటల్ రికార్డుల రూపకల్పనకు ప్లాన్..

Advertisement

రెవెన్యూ ,రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే డిజిటల్ గొడుగు కిందకు తెచ్చి, ల్యాండ్ రికార్డ్స్ పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే బ్లాక్ చైన్ సిస్టమ్ ను తెరమీద కు తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ గందరగోళాన్ని సవరించకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి రికార్డులను ఎక్కిస్తే, ఉన్న వివాదాలు డిజిటల్‌గా శాశ్వత రూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సర్వే నంబర్ల కోసం..

దీంతోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాన్-అగ్రికల్చర్ ల్యాండ్స్, వివాదాస్పద సర్వే నంబర్ల కోసం ప్రత్యేక డ్రోన్ ఆధారిత డిజిటల్ రీ-సర్వే చేపట్టేందుకు సర్కార్ ప్లాన్ చేసింది. రెవెన్యూ, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ ,రిజిస్ట్రేషన్ శాఖల మధ్య డేటా ఇంటిగ్రేషన్ పూర్తి చేసి, డూప్లికేట్ నంబర్లకు ప్రత్యేక యూనిక్ ఐడీ కేటాయించనున్నారు. అంతేగాక లింక్ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్న క్లీన్ ప్రాపర్టీలను మొదటి విడతగా బ్లాక్ చైన్‌లో చేర్చి, వివాదాస్పద భూములకు ప్రత్యేకంగా జుడీషియల్, ట్రైబ్యునల్ ద్వారా పరిష్కారం చూపేలా కార్యచరణ సిద్ధమైంది.

Also read: జైలర్ 2లో హృతిక్ రోషన్.. 5 నిమిషాలకే అన్ని కోట్లా?

Tags

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×