E-Paper
Advertisement

Srikakulam Robbery: శ్రీకాకుళంలో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో భారీ దోపిడీ!

Srikakulam Robbery: శ్రీకాకుళంలో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో భారీ దోపిడీ!
Advertisement

Srikakulam Robbery: ఇటీవలి కాలంలో దొంగతనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడు రక్తాన్ని చెమటగా మార్చి.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న సొత్తును దొంగలు నిమిషాల్లో దోచుకెళ్తున్నారు.

ఇంటికి తాళాలు వేసినా, CCTV లు ఏర్పాటు చేసినా.. కిటికీల నుండో, తలుపులు పగులగొట్టో కేటుగాళ్లు ఎలా వస్తున్నారో, ఏ మార్గంలో మాయం అవుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో దొంగలు పది భారీ దోపిడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

Advertisement

శ్రీకాకుళం జిల్లాలోని బాలిగాం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పక్కా పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడ్డారు. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో.. ఒకే వీధిలో వరుసగా ఉన్న ఐదు ఇళ్లను టార్గెట్ చేశారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. బీరువాలను బద్దలు కొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. బాధితులు ఉదయం లేచి చూసేసరికి ఇళ్లలోని సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండటం.. బీరువాలు తెరిచి ఉండటంతో షాక్‌కు గురయ్యారు.

ఈ దోపిడీలో దొంగలు భారీ మొత్తంలో నగదు, నగలను అపహరించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 15 తులాల బంగారం, 3 కిలోల వెండి వస్తువులను దుండగులు తీసుకెళ్లారు. వీటితో పాటు బీరువాల్లో ఉన్న కొంత నగదును కూడా దొంగిలించినట్లు సమాచారం. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో దొంగతనం జరగడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.

Advertisement

బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. గ్రామ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also Read: భారత్- అమెరికా ట్రేడ్ డీల్.. కీ హైలైట్స్ ఇవే..!

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×