E-Paper
Advertisement

ఆమె గుర్తొస్తే గుండెల్లో కోత… కన్నీళ్లు పెట్టించే అందమైన ప్రేమ ప్రయాణం

ఆమె గుర్తొస్తే గుండెల్లో కోత… కన్నీళ్లు పెట్టించే అందమైన ప్రేమ ప్రయాణం
Advertisement

Kannada Romantic Drama: ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన అనుభూతి. కానీ కొన్నిసార్లు విధి ఆడే విచిత్ర నాటకంలో, సమాజం విసిరే సవాళ్ల వల్ల ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమికులు విడిపోవాల్సి వస్తుంది. అలా విడిపోయినా, మనసులోని పాత జ్ఞాపకాలు వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఎమోషనల్ అండ్ హృదయ విదారకమైన ప్రేమకథా చిత్రమే కన్నడ రొమాంటిక్ డ్రామా ‘లవ్ సీజన్స్’ (Love Seasons Movie). ఒక అబ్బాయి జీవితంలోకి ముగ్గురు అమ్మాయిలు వస్తే.. ముగ్గురూ అతని జీవితాన్ని మార్చేస్తే? ప్రేమ, మోసం, బాధ, త్యాగం.. ఇలా ఒక్కో దశలో ఒక్కో అనుభూతిని చూపించే కన్నడ రొమాంటిక్ డ్రామా ఈ మూవీ. అయితే ఇది టర్కిష్ వెర్షన్‌కు రీమేక్ కాదు. పూర్తి భిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి రామ్ జీవితంలోకి వచ్చిన ఆ ముగ్గురు మహిళలు ఎవరు? అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథలోకి వెళ్తే…

అనాథగా పెరిగిన రామ్‌కి చిన్నప్పటి నుంచే ఎన్నో కలలు ఉంటాయి. అతని జీవితంలోకి మొదట మేరీ వస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతుంది. కానీ విధి మాత్రం వారి ప్రేమను ఎక్కువ కాలం కొనసాగనివ్వదు. మేరీ అనుకోకుండా మరణించడంతో రామ్ పూర్తిగా కుంగిపోతాడు. అయినా ఆమెపై ఉన్న ప్రేమను మాత్రం వదులుకోడు. మేరీ తల్లిదండ్రులనే తన తల్లిదండ్రులుగా భావించి వారితో కలిసి జీవిస్తూ తన ప్రేమకు ఒక కొత్త అర్థాన్ని ఇస్తాడు.

Advertisement

ఆ తర్వాత రామ్ జీవితంలోకి మరో మహిళ వస్తుంది. ఈసారి అతని ప్రయాణం ప్రేమ నుంచి నమ్మకం, అక్కడి నుంచి మోసం వైపు సాగుతుంది. తాను నిజంగా ప్రేమించిన వ్యక్తి నుంచి ఎదురైన నమ్మకద్రోహం రామ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రేమపై ఉన్న అతని నమ్మకం కూడా క్రమంగా కదిలిపోతుంది. ఇక మూడో దశలో చందన గౌడ పోషించిన పాత్ర రామ్ జీవితంలోకి వస్తుంది. ఈ పరిచయం అతనికి ప్రేమ మాత్రమే కాదు.. జీవితంలో ఓర్పు, త్యాగం, బాధ్యత ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చేస్తుంది. ఇలా ముగ్గురు మహిళలు రామ్ జీవితంలోని మూడు విభిన్న ‘సీజన్స్‌’గా మారతారు. మరి చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఎక్కడ చూడవచ్చు ?

మొత్తంగా ‘లవ్ సీజన్స్’ రొటీన్ ప్రేమకథలా కాకుండా… ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ ఎలా మారుతూ, అతన్ని మెచ్యూర్ మెన్ గా తీర్చిదిద్దుతుందో చెప్పే ఎమోషనల్ జర్నీ. ముకుంద రామస్వామి, దియా కీర్తి, చందన గౌడ, రాజేష్ నటరంగ, మండ్య రమేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. కృతివిక్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేమకథలను ఇష్టపడేవారికి మంచి ఫీల్ గుడ్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also: ఒంటరి తండ్రిని వదిలేసి పార్టీకి వెళ్లాలనుకున్న కొడుకు… చివరికి అదే తండ్రి కోసం మారిపోయిన కథ

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×