E-Paper
Advertisement

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సంచలనం.. శిలాశాసనం బయటపెట్టిన 500 ఏళ్ల రహస్యం!

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సంచలనం.. శిలాశాసనం బయటపెట్టిన 500 ఏళ్ల రహస్యం!
Advertisement

Sri Krishnadevaraya Era Secrets Revealed: కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లాలో అరుదైన చారిత్రక ఆధారం వెలుగులోకి వచ్చింది. కనవి తిమ్మలాపురం గ్రామంలోని దంగేరహోణి ప్రాంతంలో తాజాగా ఓ శిలాశాసనం బయటపడింది. విజయనగర సామ్రాజ్య చరిత్రకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడిస్తోంది. ఈ శాసనం స్థానిక అంగన్‌వాడీ కేంద్రం సమీపంలోని శిలాఫలకంపై చెక్కబడి ఉండగా, ఇందులో శ్రీకృష్ణదేవరాయల కాలానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను నమోదు చేశారు.

ఈ శిలాశాసనం ఎప్పుడు చెక్కించారంటే?

భారత పురావస్తు సర్వేక్షణ (ASI) శాసన విభాగం తెలిపిన వివరాల ప్రకారం, ఈ శాసనం కన్నడ భాషలో  చెక్కబడింది. 1435వ సంవత్సరం, శ్రీముఖ నామ సంవత్సరం, ఆషాఢ శుద్ధ ద్వాదశి నాటి వివరాలను క్రీ.శ. 1513 జూన్ 15 బుధవారం నాడు చెక్కించినట్లు గుర్తించారు. దాదాపు ఐదు శతాబ్దాల క్రితం జరిగిన పరిపాలన, ధార్మిక కార్యక్రమాలు, పట్టణ అభివృద్ధికి సంబంధించిన వివరాలను ఈ శాసనం తెలియజేస్తోంది.

శిలాశాసనంలో ఏ రాశారంటే?

Advertisement

శాసనంలో పేర్కొన్న వివరాల ప్రకారం, నాగలబోవ కుమారులైన ఉలిగడ చిక్క గడ్డయ్య, హిరియ గడ్డయ్య అనే వ్యక్తులు విజయనగర సామ్రాజ్య ప్రధాన మంత్రి సాళువ తిమ్మరసు, అంటే అప్పాజీ అనుమతితో ఒక కొత్త పట్టణాన్ని నిర్మించారు. ఆ పట్టణానికి శ్రీకృష్ణదేవరాయల మహారాణి తిరుమలదేవి పేరును పెట్టినట్లు ఇందులో ప్రస్తావించారు. ప్రజల ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి బుధవారం వారాంతపు సంత నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కూడా ఈ శాసనం చెబుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార అభివృద్ధికి సంతలు ఎంత ముఖ్యమో ఈ వివరాలు తెలియజేస్తున్నాయి.

Read Also: రాగాలు పలికే రాళ్లు.. నల్లగొండలోని ఈ వింత ప్రదేశం గురించి తెలుసా?

Advertisement

అంతేకాకుండా ప్రజలకు నీటి సౌకర్యం కల్పించేందుకు ఒక చెరువును తవ్వించినట్లు శాసనంలో పేర్కొన్నారు. ఆ కాలంలో వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం చెరువుల నిర్మాణానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో ఈ సమాచారం ద్వారా అర్థమవుతుంది. అంతేకాదు, ఈ శాసనంలో ధార్మిక సేవలకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. పుష్పగిరి ప్రాంతంలో చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలను నిర్మించి, అందులో విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు నమోదు చేశారు. ఆలయాల నిర్మాణంతో పాటు వాటిలో నిత్య పూజలు కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలయంలో నిత్య నైవేద్యాలు నిర్వహించేందుకు సాళువ తిమ్మరసు ప్రత్యేకంగా భూములు, ధనాన్ని దానం చేసినట్లు శాసనం వివరిస్తోంది.  ఆలయ నిర్వహణకు శాశ్వత ఆదాయం ఉండేలా అప్పట్లో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాయల పాలనలో తిమ్మరసు కీలక పాత్ర

ఈ శాసనం ద్వారా విజయనగర సామ్రాజ్య పరిపాలనలో సాళువ తిమ్మరసు కీలక పాత్ర పోషించిన విషయం  స్పష్టమవుతోంది. పట్టణాల నిర్మాణం, ప్రజా సౌకర్యాల అభివృద్ధి, ఆలయాల స్థాపన, భూదానాలు సహా అనేక కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నట్లు ఈ శాసనం చారిత్రక ఆధారంగా నిలుస్తోంది.

Read Also: రాగాలు పలికే రాళ్లు.. నల్లగొండలోని ఈ వింత ప్రదేశం గురించి తెలుసా?

Related News

భూకంపం వచ్చినా భయంలేదు.. మన బుల్లెట్ రైలుకు సూపర్ సేఫ్టీ షీల్డ్!

ఏసీ కోచ్‌లో రెండు బెడ్ షీట్లు ఎందుకు ఇస్తారు? అసలు కారణం ఇదే!

హైదరాబాద్‌ కు వచ్చిన జపాన్.. మిస్ అయితే మళ్లీ దొరకదు!

రాగాలు పలికే రాళ్లు.. నల్లగొండలోని ఈ వింత ప్రదేశం గురించి తెలుసా?

ఇదేందయ్యా ఇది.. ఇక్కడ కారు నడిపితే, ఆకాశంలో తేలినట్లే.. నెవర్ బిఫోర్ రోడ్డు!

గోల్డెన్ కలర్ పాముల సామ్రాజ్యం.. అందమైన ఆ దీవి మనుషుల పాలిట డెత్ ట్రాప్‌గా ఎలా మారింది?

953 కిటికీలతో పురాతన టెక్నాలజీ రాజభవనం.. శ్రీ కృష్ణుడి మకుటంలాంటి ఆకారం..విదేశీ పర్యటకుల ఫేవరెట్

Big Stories

Advertisement
×